నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగంలో మరో కీలక సంస్కరణకు సిద్ధమవుతోంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల కోసం ఔషధాల సేకరణకు ఒక ఉమ్మడి వేదికను రూపొందించనుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్(Central Government) హెల్త్ స్కీమ్ (CGHS), ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) హాస్పిటల్స్(Hospitals), జన్ ఔషధి స్కీమ్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు మందులు సరఫరా చేయనున్నారు. ఔషధాల నాణ్యతను కాపాడడమే కాకుండా మందుల ధరలను తగ్గించాలనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ప్రయోజనాలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ.. పథకం స్థాయి, ప్రాధాన్యం ఆధారంగా ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత క్రమంగా ప్రయోజనాలు అందుతాయని భావిస్తున్నారు.
ఒక చర్చలో.. భారతదేశంలో BCG హెల్త్‌కేర్ ప్రాక్టీస్‌కు సహ-నాయకత్వం వహిస్తున్న BCG మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామి రిషబ్ బింద్లీష్ మాట్లాడుతూ.. ఔషధాల వ్యవస్థీకృత సేకరణ గణనీయమైన లాభాలను అందిస్తుందని, దాదాపు 10% కంటే ఎక్కువ ప్రయోజనాలు వీటిలో అంతిమంగా రోగులకు అందుతాయని వివరించారు. అయితే అటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఆచరణీయ డిమాండ్
CGHSలో మాత్రమే దాదాపు 1,200 ఆసుపత్రులు, 200 ఎంప్యానెల్ డయాగ్నస్టిక్ సెంటర్లు, 500 వెల్నెస్ సెంటర్లు, 8,000 కంటే ఎక్కువ జన్ ఔషధి స్టోర్లు ఉన్నాయి. అటువంటి వైవిధ్యమైన విభాగాలకు, పంపిణీ వ్యవస్థల డిమాండ్‌లను తీర్చడానికి ప్రభుత్వానికి పటిష్ఠమైన ప్రణాళిక, అంచనాలు అవసరం. దీనికి డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మద్ధతు అవసరం.
ఔషధాల నాణ్యత
బిడ్డర్‌లకు బలమైన సాంకేతిక అర్హత ప్రమాణాలు అవసరం. NABL-ఆమోదిత ల్యాబ్‌లలో పరీక్షించిన తర్వాత మంధులు బ్యాచ్‌ల వారీగా విడుదల అవుతాయి. నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఫూల్‌ప్రూఫ్ టెస్టింగ్ ప్రోటోకాల్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అధికారికంగా ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి యోజన (PM BJP) పథకం కింద జన్ ఔషధి దుకాణాలను పునరుద్ధరించడానికి, నాణ్యత వైఫల్యాల నుంచి ప్రభుత్వం తప్పక నేర్చుకోవాలి. ఈ పథకం కింద ప్రభుత్వం నాన్-బ్రాండెడ్, జనరిక్ మందులను జన్ ఔషధి కేంద్రాలు అనే రిటైల్ ఫార్మసీ అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తుంది. సాధ్యమైనంత తక్కువ ధరకు ఔషధాలను విక్రయించాలనే ఆలోచన ఉండగా, నాణ్యతతో కూడిన మందులు అందించడంలో విఫలమైంది.
అయినప్పటికీ కఠినమైన నాణ్యతా తనిఖీలతో నాణ్యతా సమస్యలను పరిష్కరించడంతో..ఈ పథకం ఆదాయం ఐదేళ్లలో 55 రెట్లు పెరిగింది. 2016-17లో రూ.12 కోట్ల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.665 కోట్లకు చేరుకుంది. నాణ్యమైన మందులను ప్రాజెక్ట్‌లో కీలకంగా భావించాలి. చివరికి రాబడిని మాత్రమే కాకుండా.. తప్పనిసరిగా వాటాదారుల అపరిమితమైన నమ్మకాన్ని సంపాదించాలి.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆసక్తి
పాలసీకి ఒక-పాయింట్ కొనుగోలు ఒప్పందాలు అవసరమైతే, బహుళ టెండరింగ్ అధికారుల మునుపటి వ్యవస్థ రద్దు చేసే అవకాశం ఉంది. బహుళ టెండర్‌లకు బదులుగా ఒక సాధారణ టెండర్‌ని తేలినట్లయితే.. సరఫరాదారులు పెద్ద వాల్యూమ్‌ను పరిష్కరించవలసి ఉంటుంది. దీనికి మరింత వర్కింగ్ క్యాపిటల్.. సాధారణంగా ఒక శాతం ఉండే ఆర్జెంట్ మనీ డిపాజిట్‌లు (EMD) వంటి ప్రదేశాలలో పెద్ద వనరుల ప్రమేయం అవసరం. మధ్యతరహా , చిన్నతరహా పరిశ్రమలకు ఇది అడ్డంకిగా పని చేస్తుంది. మల్టీవిటమిన్‌ల కొనుగోలు కోసం ప్రత్యేక కాంట్రాక్టుల వంటి MSMEల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు పథకం తయారీలో పాలుపంచుకున్న అధికారులు విశ్వసిస్తున్నప్పటికీ, భారతీయ ఫార్మా మార్కెట్ మొత్తం వృద్ధిపై దృష్టి పెట్టాలి.
బిడ్డింగ్‌లో పారదర్శకత
టెండరింగ్ సవాళ్లతో పాటు బిడ్డింగ్‌లో పారదర్శకత ముఖ్యం. ప్రభుత్వ eMarketplace (GeM) వంటి టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడం డిమాండ్‌ను ఏకీకృతం చేయడం, ఆర్థిక వ్యవస్థల స్థాయిని పెంచడం, అన్ని వాటాదారులకు పారదర్శకతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇది ప్లాట్‌ఫారమ్ స్వీకరణ, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. మళ్లీ జన్ ఔషధి పథకం నుంచి నేర్చుకొన్న పాఠాలు ఈ చర్యను మరింత మెరుగ్గా రూపొందించడంలో మార్గనిర్దేశం చేస్తాయి. జన్ ఔషధి ఆడిట్ నివేదిక ప్రకారం.. అధికారులు కొన్ని ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా రూ.47 కోట్ల ఖర్చుతో, నిల్వ సౌకర్యం లేకుండా ఆరు రెట్లు మందులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంకా స్టాక్‌లో ఉన్న 650కి పైగా మందులలో ముగ్గురు ప్రైవేట్ సరఫరాదారుల నుంచి మొత్తం స్టాక్‌లో 35% పొందినట్లు తెలిపాయి.
సంక్షిప్తంగా…
ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ ఈ చర్యను 'ప్రోగ్రెసివ్' అని పిలుస్తూ స్వాగతిస్తున్నప్పటికీ.. వాస్తవానికి వ్యక్తిగత మంత్రిత్వ శాఖలు లేదా ప్రభుత్వ శాఖలతో ఆకర్షణీయమైన ధరల కొటేషన్‌లను చర్చించే అవకాశాన్ని తగ్గించడంపై సంతోషంగా ఉండకపోవచ్చు. ఇప్పటివరకు రాబోయే పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వాల కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వ కొనుగోళ్లకు ఉపయోగపడుతుందని అర్థం. ప్రజారోగ్యం మరియు ఔషధాల సేకరణ బడ్జెట్‌లు రాష్ట్ర పరిధిలో ఉన్నందున పెద్ద ప్రయోజనాలను పొందడం కోసం ప్రాజెక్ట్‌కు రాష్ట్రాల సహకారం అవసరం. అయినప్పటికీ జన్ ఔషధి యోజనను భారీ స్థాయిలో పెంచడంలో ప్రభుత్వం విజయం సాధించింది.
దేశంలో మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నిరూపితమైంది. దీంతో మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు జన ఆకర్షక పథకాలపై మోదీ అమిత్‌షా కసర్తత్తులు చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా పథకంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.