క్రైస్తవులు ఎవరైనా మరణిస్తే వారిని చర్చి నియమాలకు అనుగుణంగా పూడ్చిపెడతారు. అయితే దేశంలో కరోనా రెండో వేవ్ తీవ్రంగా విజృంభిస్తోన్న వేళ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా మరణించిన క్యాథలిక్కుల దహన సంస్కారాలను అనుమతించాలని అహ్మదాబాద్ డియోసెస్ క్యాథలిక్ బిషప్ ఒకరు క్యాథలిక్ చర్చిని కోరారు. చనిపోయిన క్యాథలిక్‌లను ఖననం చేయవచ్చు లేదా దహన సంస్కారాలు నిర్వహించవచ్చని హోలీ మదర్ చర్చి బోధిస్తుందని చర్చికి ఓ లేఖలో రాశారు.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదబాద్ డియోసిస్ చర్చిలో బిషప్ గా సేవలందిస్తున్నారు అథనాసియస్ రత్న స్వామి. కోవిడ్ మరణాలు తీవ్రంగా ఉన్న వేళ చనిపోయిన వారికి గౌరవపూర్వకమైన దహన సంస్కారాలు నిర్వహించాలని, ఆ బాధ్యత క్యాథలిక్ చర్చే తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. "మరణించిన వారి అంతిమ సంస్కారాలను నిర్వహించడం చర్చికి సవాలుగా మారింది. మన శ్మశానవాటికలో స్థలం సరిపోకవపోవట్లదనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ఈ సందర్భంగా క్యాథలిక్ చర్చిలో దహన సంస్కారాలు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరణించిన వ్యక్తులను ఖననం చేయవచ్చు లేదా దహనం చేయవచ్చని హోలీ మదర్ చర్చి బోధిస్తుంది. మరణించిన వారిని సమాధి చేయడం, వారి బూడిదను సంరక్షించడం గురించి ఇన్ స్ట్రక్షన్ రిసర్జెండం కమ్ క్రిస్టోలో నిస్సందేహంగా చెప్పబడింది. దహన సంస్కారాల గురించి 2016 ఆగస్టు 15న విశ్వాస సిద్ధాంత జారీ చేశారు. ఆరోగ్య లేదా ఆర్థిక లేదా సామాజిక అంశాల కారణంగా దహన సంస్కారాలను ఎంచుకోవడం మరణించిన విశ్వాసుల సహేతుకరమైన కోరికలను ఉల్లఘించకూడదు. దీనికి సిద్ధాంతపరమైన అభ్యంతరాలేవి లేవు. ఎందుకంటే మరణించిన వ్యక్తి దేహం అతని లేదా ఆమె ఆత్మను ప్రభావితం చేయదు. లేదా దేవుడు తన సర్వశక్తితో ఆ దేహానికి నూతన జీవితాన్ని ఇవ్వకుండా నిరోధించడు. అందువల్ల దహన సంస్కారాలు, స్వయంగా నిష్పాక్షికంగా ఆత్మ అమరత్వం లేదా శరీర పునరుత్థనం క్రైస్తవ సిద్ధాంతం తిరస్కరించదు" అని అన్నారు.
కోవిడ్‌తో మరణించే క్యాథలిక్కుల దహన సంస్కారాలు ఇష్టపూర్వకంగా చేయాలని బిషప్ వ్యక్తం చేశారు. కొన్ని శ్మశానాల్లో స్థలం కొరత కూడా ఉందని అన్నారు. చర్చి నియమాలకు అనుగుణంగా దహన సంస్కారాలు దైవజనుల సమక్షంలో నిర్వహించి పూర్తి గౌరవంతో స్మశానగూడులో భద్రపరచాలని ఆయన క్యాథలిక్ చర్చిని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.