IVF: దేశంలోని పాడిపరిశ్రమ రంగంలో సంచలనం.. ఆ రాష్ట్రంలో మొదటి సారిగా ఐవీఎఫ్​ పద్దతిలో​ దూడ జననం

ఐవీఎఫ్​ పద్దతిలో జన్మించిన దూడ (photo:ANI/Twitter)

పాల ఉత్పత్తిలో దేశంలో మరో సరికొత్త విప్లవం మొదలయింది. అత్యధికంగా పాలను ఇచ్చే బన్నీ బ్రీడ్‌కు చెందిన గేదే ఐవీఎఫ్ (In vitro fertilization) విధానంలో దూడ (Calf)కు జన్మనిచ్చింది.

  • Share this:
    పాల ఉత్పత్తి (Milk production) లో దేశంలో మరో సరికొత్త విప్లవం మొదలయింది. అత్యధికంగా పాలను ఇచ్చే బన్నీ బ్రీడ్‌కు చెందిన గేదే ఐవీఎఫ్ (In vitro fertilization) విధానంలో దూడ (Calf) కు జన్మనిచ్చింది. ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్ (In vitro fertilization) విధానంలో లేగ దూడ జన్మించడం దేశంలో ఇదే తొలిసారి. ఈ బన్నీ బ్రీడ్‌ (Bunny breed) కు చెందిన గేదెలు గుజరాత్‌ (Gujarat)లోని కఛ్ రీజియన్‌లో కనిపిస్తుంటాయి. సమృద్ధిగా పాల (milk)ను ఇచ్చే బన్నీ బ్రీడ్‌కు చెందినవి అవి. ఒక్కో బన్నీ బ్రీడ్ గేదె (buffalo) ఒక్కసారికే 12 నుంచి 18 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 15, 2020న గుజరాత్‌లోని కచ్ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా బన్ని గేదె జాతి గురించి మాట్లాడారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 16, 2020, ఓవమ్ పిక్-అప్ (ఓపీయూ) , ఆస్పిరేషన్ ప్రక్రియలో బన్ని గేదెలపై ఐవీఎఫ్ చేపట్టారు.

    ప్రకటించిన పశు సంవర్ధక శాఖ..

    గుజరాత్ పశు సంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఐవీఎఫ్ (IVF) విధానంలో టెస్ట్ ట్యూబ్ (test tube) ద్వారా లేగదూడకు జన్మనిచ్చేలా చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఫలితంగా పాలను మరింత అధికంగా ఉత్పత్తి చేయడానికి ఈ ప్రయోగం బాటలు వేసినట్లు తెలిపారు. గుజరాత్​లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని ధనెజ్ గ్రామంలో ఓ రైతు (farmer) కు చెందిన గేదె.. ఐవీఎఫ్ (IVF) విధానంలో లేగ దూడ (Calf)కు జన్మనిచ్చేలా అధికారులు (Officials) ప్రయోగాలు చేశారు. అది సక్సెస్ (success) అయింది.

    పాడి పరిశ్రమ రంగంలో పలు సంస్థల మద్దతు..

    బన్నీ బ్రీడ్‌కు చెందిన మొత్తం ఆరు గేదెల్లో టెస్ట్ ట్యూబ్ విధానంలో దూడ (Calf)లకు జన్మనిచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో ఓ గేదె శనివారం దూడకు జన్మనిచ్చింది. సుశీల ఆగ్రోఫామ్స్‌లో పని చేసే వినయ్ ఎల్ వాలా అనే రైతుకు చెందిన గేదె అది. పాడి పరిశ్రమ రంగంలో ఉన్న కొన్ని సంస్థలు ఈ ప్రయోగానికి తమవంతు సహకారాన్ని అందించినట్లు పశుసంవర్దక శాఖ తెలిపింది.



    వచ్చే వారంలో ఐదు గేదెలు..

    జేకే ట్రస్ట్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ జేకే బొవాజెనిక్స్, రేమాండ్ గ్రూప్ సాంకేతిక సహకారాన్ని ఇచ్చాయి. మొత్తం ఆరు బన్నీ బ్రీడ్ గేదెల ద్వారా ఐవీఎఫ్ (IVF) విధానంలో దూడలు జన్మించేలా ఏర్పాట్లు చేశాయి. అందులో ఒకటి ఈనింది. దీని ఫొటోలను పశు సంవర్ధక శాఖ అధికారులు విడుదల చేశారు. మరో వారం రోజుల్లో మిగిలిన అయిదు గేదెలు కూడా దూడలకు జన్మనిస్తాయని తెలిపారు. ఒక్కో బన్నీ బ్రీడ్ గేదె ఒక్కసారికే 12 నుంచి 18 లీటర్ల వరకు పాలు ఇస్తుందని, అలాంటివి తన వద్ద ఆరు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల ఈ బ్రీడ్ గెదెల సంఖ్య పెరుగుతుందని అన్నారు
    Published by:Prabhakar Vaddi
    First published: