ఆగస్ట్ 15న మూక హత్యలపై డాక్యుమెంటరీ రిలీజ్

'ద బ్రదర్‌హుడ్'... మూకహత్యలపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి సెన్సార్‌ బోర్డ్ క్లియరెన్స్ వచ్చింది. ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.

news18-telugu
Updated: August 13, 2018, 3:26 PM IST
ఆగస్ట్ 15న మూక హత్యలపై డాక్యుమెంటరీ రిలీజ్
(Image courtesy: YouTube)
  • Share this:
భారతదేశంలో చాలా డాక్యుమెంటరీలు ప్రచారం లేకుండానే మరుగున పడిపోతుంటాయి. యూట్యూబ్‌లోనూ పెద్దగా ప్రచారం దొరకదు. కానీ మూక హత్యల(మాబ్ లించింగ్)పై జర్నలిస్ట్ పంకజ్ పరాషర్ తీసిన డాక్యుమెంటరీకి కాస్త మంచి అవకాశాలే లభిస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలీజ్ కానుంది. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అంతే కాదు టాటా స్కై లాంటి డీటీహెచ్‌లల్లో స్పెషల్ ప్రివ్యూ ఉంది.

ఈ డాక్యుమెంటరీకి సెన్సార్ బోర్డ్ నుంచి మొదట్లో ఇబ్బందులొచ్చాయి. దీంతో డాక్యుమెంటరీ రూపకర్త పంకజ్ ఇండియన్ సెన్సార్ అప్పీల్ ట్రైబ్యూనల్‌ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. 2015 సెప్టెంబర్ 28న బీఫ్ తిన్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసుపైనే 'ద బ్రదర్‌హుడ్' డాక్యుమెంటరీ రూపొందింది.

Published by: Santhosh Kumar S
First published: August 13, 2018, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading