ఎవరైనా ఒక వ్యక్తి తమని నమ్మి వచ్చినప్పుడు వారిని కాపాడాల్సిన పూర్తి భాద్యత వారిదే ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మనిషికి అపాయం జరుగుతుంటూ చూస్తూ ఉండడం కూడా నేరమే.. అనే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒకరికి బెయిలు ఇచ్చెందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే తనను నమ్మి వచ్చిన ప్రియురాలిపై ఇతర దుండగులు అత్యాచారం చేస్తున్నప్పుడు ప్రియుడు తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడంతో ఆ ప్రియుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
వివరాల్లోకి వెళితే.. గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు.. కుట్టుమిషన్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్కు వెళ్లి.. అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని నిర్భంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో మరుసటి రోజు బాధితురాలు స్థానిక అకిల్సారాయ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే.. అత్యాచారానికి సంబంధించి విచారణలో భాగంగా ఆమె ప్రియురాలు రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది చదవండి : భూ కంపం.. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రకంపనలు.. !
కాగా.. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉంది. కానీ, తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడని వ్యాఖ్యానించింది.. అతడి వ్యవహారశైలి అనుమానస్పదంగా ఉంది వ్యాఖ్యానించింది. అలాగే.. మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేం అని హైకోర్టు తెలిపింది.దీంతో నిందితుడు రాజుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ఇది చదవండి : నిరుద్యోగి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్కు లేఖ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, National News