కేంద్రమంత్రిపై ఇంకు చల్లి నిరసన...డెంగీ వ్యాధి నివారణపై ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్రోశం

నిశాంత్ ఝా అనే ఆ యువకుడు కేంద్ర మంత్రిపై ఇంకు చల్లి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు.

news18-telugu
Updated: October 15, 2019, 10:03 PM IST
కేంద్రమంత్రిపై ఇంకు చల్లి నిరసన...డెంగీ వ్యాధి నివారణపై ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్రోశం
కేంద్రమంత్రి అశ్వినీ చౌబేపై ఇంకు చల్లి నిరసన
  • Share this:
కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబేపై ఒక యువకుడు ఇంకు చల్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిశాంత్ ఝా అనే ఆ యువకుడు కేంద్ర మంత్రిపై ఇంకు చల్లి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. డెంగీ జ్వరంతో బాధపడుతున్న రోగుల పరిస్థితిని సమీక్షించేందుకు పాట్నా మెడికల్ కాలేజ్, ఆసుపత్రిని ఆయన సందర్శించాడు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే తనపై అలా బహిరంగంగా ఇంకు చల్లడాన్ని తప్పుపట్టారు. కాగా మంత్రిపై ఇంకు చల్లిన యువకుడు తర్వాత ఒక ప్రైవేట్ న్యూస్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో తాను మాజీ ఎంపి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్‌కు అనుచరుడిని అని తెలిపాడు. రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాను ఇలా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపాడు.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading