విమాన ప్రయాణికులకు షాక్.. 92 ఎయిరిండియా విమానాలు రద్దు..

మే 28 నుంచి మే 31తేదీల్లో నడవాల్సిన 92 విమానాలను రద్దు చేశారు. దీంతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి వెల్లడించారు.

news18-telugu
Updated: May 27, 2020, 2:54 PM IST
విమాన ప్రయాణికులకు షాక్.. 92 ఎయిరిండియా విమానాలు రద్దు..
ఫేజ్ 3 అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు లాంటివి ఎప్పుడు తెరవాలనే అంశంపై ఫేజ్ 3లో నిర్ణయం తీసుకుంటారు. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భారీ ఎత్తు ఫంక్షన్లు జరపకూడదు. పరిస్థితిని బట్టి వాటిని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు.
  • Share this:
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల దాదాపు రెండు నెలల పాటు అన్ని విమానప్రయాణాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఇటీవలే తిరిగి విమాన ప్రయాణాలు పునరుద్ధరించుకున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా పలు మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పరిమిత కార్యకలాపాలు, క్వారంటైన్ నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మే 28 నుంచి మే 31తేదీల్లో నడవాల్సిన 92 విమానాలను రద్దు చేశారు. దీంతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి వెల్లడించారు. రద్దు చేసిన విమానాల్లో ఢిల్లీ-కోల్‌కతా, చెన్నై-ఢిల్లీ, హైదరాబాద్-బెంగళూరు, కోల్‌కతా-గౌహతి, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, చెన్నై-ముంబై, ముంబై-భోపాల్, కోల్‌కతా-దిబ్రుగర్, కోల్‌కతా-అగర్తలా, ముంబై-ఢిల్లీ, ముంబై-అహ్మదాబాద్ తదితర మార్గాల మధ్య నడిచేవి ఉన్నాయి.

రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేసినవారు 2020 ఆగస్టు 24 వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉన్న విమానాల్లో బుక్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. రూటు మార్చుకునేందుకు అనుమతి ఉంటుందని, ఛార్జీల్లో వ్యత్యాసం తప్ప, దీనికి సంబంధించిన చార్జీలను రద్దు చేసినట్టు పేర్కొంది.
First published: May 27, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading