ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సరికొత్త చరిత్ర సృష్టించింది. నేడు గుజరాత్ లో ఆప్ కు పోలైన ఓట్లతో జాతీయ పార్టీగా AAP అవతరించింది. అయితే గుజరాత్ (Gujarat) లో అధికారం వస్తామని ఆప్ కలలు ఆవిరైన జాతీయ పార్టీ హోదా సాధించడంతో ఆప్ కన్న మరో కల నెరవేరినట్లైంది. ఈ విషయంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాత్ ప్రజల ఓట్లతో నేడు ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తుంది. జాతీయ రాజకీయాల్లో విద్య, ఆరోగ్యం మొదటిసారిగా ప్రధాన అంశాలుగా నిలిచాయని మనీష్ సిసోడియా (Manish Sisodia) పేర్కొన్నారు. ఆప్ జాతీయ ఆశయాలకు జాతీయ హోదా మరింత బూస్టప్ ఇస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
गुजरात की जनता के वोट से आम आदमी पार्टी आज राष्ट्रीय पार्टी बन रही है.
शिक्षा और स्वास्थ्य की राजनीति पहली बार राष्ट्रीय राजनीति में पहचान बना रही है.
इसके लिए पूरे देश को बधाई.
— Manish Sisodia (@msisodia) December 8, 2022
జాతీయ పార్టీగా అర్హత పొందేదెలా..
ఏదైనా ఒక పార్టీ జాతీయ హోదా సాధించాలంటే కొన్ని అర్హతలు పొందాలి. దేశంలోని ఏదేని 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుంది. ఇక ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉంది. అలాగే గోవాలో ఆప్ కు 6 శాతానికి ఓట్లతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక నేడు వెలువడిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాల్లో ఒక్క చోటైనా 6 శాతం ఓట్లు సాధిస్తే ఆప్ జాతీయ పార్టీగా అవతరించనుంది. ఇక ఇప్పటివరకు గుజరాత్ లో 5 స్థానాల్లో ముందజలో ఉంది. దీనితో ఆప్ జాతీయ పార్టీగా అవతరించబోతుంది.
Amit Shah: గుజరాత్లో బీజేపీ భారీ విజయం.. న్యూస్18 ఇంటర్వ్యూలో ముందే చెప్పిన అమిత్ షా
నెరవేరిన కేజ్రీవాల్ కల..
ఇక ఆప్ జాతీయ పార్టీగా అవతరించనున్న నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కింద ఆమ్ ఆద్మీ చిన్నపార్టీ. కానీ 10 సంవత్సరాల తరువాత ఆప్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ జాతీయ పార్టీ హోదా రానుందని కేజ్రీవాల్ తెలిపారు.
AAP National Convenor Shri @ArvindKejriwal's video message congratulating party workers on the occasion of Aam Aadmi Party attaining National Party status:pic.twitter.com/mKPovTgaKA
— AAP (@AamAadmiParty) December 8, 2022
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు కావాలి. నేడు వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 156 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నెల 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Aravind Kejriwal, Delhi, Goa, Gujarat Assembly Elections 2022, Kejriwal, Punjab