Parliament Monsoon Session 2020: ఇండియా-చైనా సరిహద్దు టెన్షన్లు, పడిపోయిన GDP వృద్ధి రేటు, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం, వలస కార్మికుల సమస్యలు, కరోనా వైరస్... ఇవీ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే కీలక అంశాలు. సోమవారం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. 18 రోజుల పాటూ అంటే... అక్టోబర్ 1 వరకు ఇవి కొనసాగనున్నాయి. కరోనా కారణంగా... సోమవారం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరుగుతుంది. అలాగే... మంగళవారం నుంచి ఉదయం 9 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి లోక్‌సభ జరుగుతాయి. ఈసారి... శని, ఆదివారం కూడా సభలుంటాయి. మొత్తం 12 బిల్లులు చర్చకు రానున్నాయి. అలాగే... ఈమధ్య జారీ చేసిన 11 ఆర్డినెన్సులు కూడా ఆమోదానికి వస్తాయి. అంతా బాగానే ఉన్న కరోనా టెన్షన్ తప్పట్లేదు. ఆల్రెడీ ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందువల్ల మిగతా ఎంపీల్లో ఎవరికైనా వైరస్ సోకుతుందా అనే టెన్షన్ ఉంది.
ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సారథ్యంలో... BAC మీటింగ్ జరిగింది. సమావేశాల్లో ఏం చర్చించాలో అందులో మాట్లాడుకున్నారు. మరోసారి మంగళవారం BAC సమావేశం పెట్టుకొని... ఏం చర్చించాలో డిసైడవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా... MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ... BAC మీటింగ్‌లో సరిహద్దు అంశాన్ని ప్రస్తావించారు. "అసలు ఇండియా-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది" అని ఆయన గట్టిగా అడగడం... కేంద్ర ప్రభుత్వానికి ఒకింత ఇబ్బంది కలిగినట్లు తెలిసింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి... దీనిపై ఎంపీలకు కేంద్రం చిన్నపాటి వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీనిపై మంగళవారం నాటి BAC మీటింగ్‌లో ప్రస్తావిద్దామని కేంద్రం చెప్పినట్లు తెలిసింది. మంగళవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై ఓ ప్రకటన చేస్తారని సమాచారం.
ఎంపీలాడ్స్ నిధులు తగ్గించడంపై చాలా మంది ఎంపీలు అభ్యంతరం చెప్పారు. అలాగే... కరోనా పేరు చెప్పి ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసేయడంపైనా ఎంపీలు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే అన్నారు. ఓ రోజు 4 గంటలు కూర్చొని... ప్రశ్నోత్తరాలు పెట్టుకుందామని కొందరు కోరారు.
అసలు ఇవాళ ఏం జరుగుతుందంటే... హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు, ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్ట్ ఇన్ ఆయుర్వేద బిల్లు 2020 లను లోక్‌సభలో చర్చకు పెట్టి... ఆమోదిస్తారని తెలుస్తోంది. ఈ రెండు బిల్లులూ... రాజ్యసభలో ఆల్రెడీ ఆమోదం పొందాయి. ఇలా సోమవారం సమావేశం ముగించాలన్నది కేంద్రం ప్లాన్‌గా తెలిసింది.
మంగళవారం మంత్రుల జీతాలు, బత్యాల సవరణ బిల్లు 1952ను ప్రవేశపెట్టి... ఆమోదిస్తారని తెలిసింది. సవరణ ఏంటంటే... ఎంపీల శాలరీలను 30 శాతం తగ్గిస్తూ సవరణ చేశారు. వచ్చే రెండేళ్లపాటూ... ఈ తగ్గింపు కొనసాగుతుంది. అలాగే... కేంద్రం జారీ చేసిన ఎపిడమిక్ డీసీజెస్ చట్టం 1897 ఆర్డినెన్స్‌ని కూడా కేంద్రం మంగళవారం ఆమోదించనుందని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.