హోమ్ /వార్తలు /జాతీయం /

PM Narendra Modi: థ్యాంక్యూ మోదీ.. భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

PM Narendra Modi: థ్యాంక్యూ మోదీ.. భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ (Image credit - twitter)

ప్రధాని నరేంద్ర మోడీ (Image credit - twitter)

రామాయణంలో లక్ష్మణుడికి చికిత్స అందించేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఒంటిచేత్తో ఎత్తుకొచ్చినట్లుగా... బ్రెజిల్‌కు కూడా హనుమంతుడు గాల్లో ఎగురుతూ వ్యాక్సిన్లు తీసుకెళ్తున్నట్లు ఓ ఫోటోను జైర్ బొల్సొనారో ట్వీట్ చేశారు.

కరోనాను కట్టడి చేయడంలో భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే మన దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్‌లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు మనదేశం ఉచితంగానే టీకాను అందజేస్తోంది. బ్రెజిల్‌తో పాటు పలు దేశాలకు టీకాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయనున్నారు. ఈ క్రమంలో భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసలు కురిపించింది.

''కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు సాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఒకరికొకరం సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పోరాడితేనే వైరస్‌ను నిర్మూలించగలుగుతాం. ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడలుగుతాం.'' అని WHI డీజీ డెడ్రోస్ గ్యాబ్రియేసస్‌ పేర్కొన్నారు.


ఇంతకు ముందు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కూడా భారత్‌పై ప్రశంసల జల్లుకురిపించారు. బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నందుకు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపారు. రామాయణాన్ని గుర్తుచేస్తూ ఇండియాను కొనియాడారు. రామాయణంలో లక్ష్మణుడికి చికిత్స అందించేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఒంటిచేత్తో ఎత్తుకొచ్చినట్లుగా... బ్రెజిల్‌కు కూడా హనుమంతుడు గాల్లో ఎగురుతూ వ్యాక్సిన్లు తీసుకెళ్తున్నట్లు ఓ ఫోటోను జైర్ బొల్సొనారో ట్వీట్ చేశారు. అంతేకాదు ధన్యవాదాలు అని ఇంగ్లీష్, హిందీలో పేర్కొన్నారు.


శుక్రవారం నుంచి విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభించింది భారత్. మొదట బ్రెజిల్, మొరాకో దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. త్వరలోనే కోవిషీల్డ్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది. అనంతరం మన దేశం నుంచి ఆఫ్రికా సహా పలు పేద, చిన్న దేశాలకు వ్యాక్సిన్‌లు ఎగుమతి కానున్నాయి. ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే ధర తక్కువగా ఉండడం, సమర్థవంతంగా పనిచేయడం, 2 నుంచి 8 ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేసుకునే అవకాశం ఉండడంతో.. చాలా దేశాలు భారతీయ టీకాల కోసం ముందుకొస్తున్నాయి.

First published:

Tags: Corona Vaccine, COVID-19 vaccine, PM Narendra Modi, WHO

ఉత్తమ కథలు