సీతా దేవి టెస్ట్ ట్యూబ్ బేబీనా..?

నేటి విమానాన్ని కూడా నాటి పుష్పక విమానంతో పోల్చవచ్చని దినేశ్ శర్మ అభిప్రాయపడ్డారు. శ్రీరాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేందుకు పుష్పక విమానాన్నే వినియోగించారని తెలిపారు.

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:57 PM IST
సీతా దేవి టెస్ట్ ట్యూబ్ బేబీనా..?
నేటి విమానాన్ని కూడా నాటి పుష్పక విమానంతో పోల్చవచ్చని దినేశ్ శర్మ అభిప్రాయపడ్డారు. శ్రీరాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేందుకు పుష్పక విమానాన్నే వినియోగించారని తెలిపారు.
  • News18
  • Last Updated: June 6, 2018, 2:57 PM IST
  • Share this:
టెస్ట్ ట్యూబ్ బేబీ.. అత్యంత ప్రాచీన వైద్య విధానం...! లైవ్ టెలికాస్ట్‌ కూడా ఇప్పటి సాంకేతికత కాదు...! ఇదేంటని నోళ్లు వెళ్లబెట్టారా..! ఇవి మేం చెబుతన్న మాటలు కాదు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ చెప్పిన కొత్త విషయాలు. కొంతకాలంగా బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పుడు యూపీ డిప్యూటీ సీఎం కూడా చేరారు.

గురువారం లక్నోలో హిందీ జర్నలిజం డే వేడుకలకు హాజరైన దినేశ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఉన్నదని అన్నారు. సీతా దేవి మట్టి కుండ నుంచి జన్మించారని పెద్దలు చెబుతారని...అది టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్‌ లాంటిదేనని వెల్లడించారు. నేటి విమానాన్ని కూడా నాటి పుష్పక విమానంతో పోల్చవచ్చని అన్నారు. శ్రీరాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేందుకు పుష్పక విమానాన్నే వినియోగించారని దినేశ్ శర్మ చెప్పారు.

Test Tube-like Method Used for Sita's Birth': UP Deputy CM Joins League to Bizarre Comments
లక్నోలో ఓ కార్యక్రమంలో దినేశ్ శర్మ


ఇలాంటి విషయాలను చాలానే చెప్పారు దినేశ్. లైవ్ టెలికాస్ట్ టెక్నాలజీ కూడా మహా భారత కాలం నాటి నుంచే ఉందని అన్నారు. “ మహాభారత యుద్ధాన్ని సంజయ లైవ్ టెలికాస్ట్ చేశారు. హస్తినాపురంలో ఉన్న ద్రుతరాష్ట్రుడికి మహా భారత యుద్ధ ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు  ఆయన వివరించారు. అది ప్రత్యక్ష ప్రసారమే కదా ” అని పేర్కొన్నారు.

అంతేకాదు .. “ గూగుల్ ఇప్పుడొచ్చింది. కానీ మన గూగుల్ మాత్రం వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. నారద ముని సమాచార సంగ్రహము. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికైనా  క్షణాల్లో వెళ్లేవారు. నాారాయణ..నారాయణ..నారాయణ అని మూడు సార్లు పలికి సమాచారాన్ని చేరవేసేవారు. ”  అని దినేశ్ శర్మ హిందీ పాత్రికేయుల సమావేశంలో అన్నారు.

ప్లాస్టిక్ సర్జరీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, గురుత్వాకర్షణ సిద్దాంతం, అణు పరీక్షాలు, ఇంటర్నెట్.. ఇవన్నీ ప్రాచీన కాలంలోనే ఉన్నాయంటారు దినేశ్ శర్మ.  ఇప్పడు  ఆయనచేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

దినేశ్ శర్మ వ్యాఖ్యలను అఖిల భారత హిందూ మహా సభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఖండించారు. సీతా దేవిని భౌతిక పరమైన అంశాలతో పోల్చవద్దని.. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం.. సనాతన ధర్మాన్ని కించపరచడమేనన్నారు. కాగా, గతంలో త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంటర్నెట్ పురాతన కాలంలోనే ఉండేదని అన్నారు. అప్పుడు కూడా వివాదం చెలరేగింది.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading