కశ్మీర్‌లో ఉగ్రవాదుల బీభత్సం.. పండ్ల లారీపై కాల్పులు

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో 72 రోజుల పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మొబైల్ సేవలు ప్రారంభమైన ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: October 14, 2019, 10:55 PM IST
కశ్మీర్‌లో ఉగ్రవాదుల బీభత్సం.. పండ్ల లారీపై కాల్పులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. పండ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుపై దాడిచేసి.. డ్రైవర్‌ను కాల్చి చంపారు. పండ్ల వ్యాపారిపైనా దాడి చేసి చితకబాదారు. పుల్వామా జిల్లా షిర్మల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భద్రత దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. అతడిని పాకిస్తానీగా గుర్తించారు. పారిపోయిన మరో ఉగ్రవాది కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన షరీఫ్ ఖాన్‌గా గుర్తించారు పోలీసులు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో 72 రోజుల తర్వాత పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మొబైల్ సేవలు ప్రారంభమైన ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
First published: October 14, 2019, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading