జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పోలీస్ బెటాలియన్ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శ్రీనగర్‌లోని ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిష్టితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ పోలీసులు స్పందించారు. దాడిలో గాయపడిన 14 మందిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పోలీసులు చనిపోయినట్టు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. 9వ బెటాలియన్ సిబ్బందితో వెళుతున్నబస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్ సమీపంలోని జెవాన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ముష్కరుల కోసం వేట మొదలుపెట్టారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ జమ్మూ కశ్మీర్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే నిన్న పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాది హతమైన తరువాత ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
మరణించిన పోలీసు సిబ్బందిలో ఓ ఏఎస్ఐ, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ ఉన్నారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబాలకు సానుభూతి తెలియజేసినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. పోలీసులు, భద్రతా దళాలు తీవ్రవాద దుష్ట శక్తులను తటస్తం చేయడానికి నిశ్చయించుకున్నామని జమ్మూ కశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనం.. ఫలించిన Revanth Reddy ప్లాన్..
Telangana: ఆ రోజు నుంచే రైతులకు రైతుబంధు నగదు బదిలీ.. మొదట ఇచ్చేది వారికే..
ఈ దాడిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు.శ్రీనగర్‌లో ఇద్దరు పోలీసులు మరణించిన ఘటన గురించి వినడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terror attack