TERRORIST OPENS FIRE IN SRINAGAR DISTRICT IN KASHMIR TWO POLICE MARTYRED SK
Srinagar Terror Attack: దుస్తుల్లో తుపాకీ దాచి కాల్పులు.. టెర్రరిస్ట్ బీభత్సం.. వీడియో
శ్రీనగర్లో ఉగ్రవాది కాల్పులు
ఉగ్రవాది కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత శ్రీనగర్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఘటనా స్థలానికి భారీగా భద్రతా దళాలు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
జమ్మూకాశ్మీర్లో ఓ ఉగ్రవాది రెచ్చిపోయారు. నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాడు. పోలీసులే టార్గెట్గా తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. భగత్ బార్జుల్లా ప్రాంతంలోని పోలీసులు పహారా కాస్తుండగా..ఓ టెర్రరిస్టు అక్కడికి వచ్చాడు. సాధారణ వ్యక్తిలా నడుకుచూ ముందు వచ్చి.. ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. దుస్తుల లోపల తుపాకీ దాచుకోవడంతో ఎవరూ గుర్తించలేదు. పోలీసులకు దగ్గరగా వచ్చిన తర్వాత తుపాకీ బయటకు తీసి.. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
తీవ్రంగా గాయపడిన ముగ్గురు పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఇద్దరు మరణించారు. మరికొరు చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాది కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత శ్రీనగర్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఘటనా స్థలానికి భారీగా భద్రతా దళాలు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
అటు షోపియన్, బుద్గాం జిల్లాల్లోనూ ఇదే రోజు ఎన్కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే. బుద్గాంలోని బీర్వా ప్రాంతాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) మరణించారు. షోపియన్ జిల్లా బడిగమ్ ప్రాంతంలో కూడా భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాశ్మీర్ లోయలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.