మన దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమయింది. యూపీలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులను యూపీ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్వ్వాడ్) అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు చెందిన అల్ ఖైదా ఉగ్రవాది ఉమర్ హల్మాండి భారత్‌లో ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. యూపీలో కొందరు యువతను ఉగ్రవాదం ప్రేరేపిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే యూపీ ఏటీస్ దళాలు రంగంలోకి దిగి లక్నోలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లక్నోలోని కకోరి ప్రాంతంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కురని తెలియడంతో ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాంబ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. మిన్హాజ్ అహ్మద్, మసిరుద్దిన్ అక ముషిర్‌ను అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. వీరితో షకీల్ అనే వ్యక్తికి కూడా సంబంధాలున్నట్లు గుర్తించారు.
యూపీలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం హల్మండి ఈ ముగ్గురినీ నియమించినట్లు తెలుస్తోంది. వీరు అల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్‌కు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 15కు ముందు లక్నోతో పాటు యూపీలో పలు ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి దగ్గరి నుంచి ప్రెజర్ కుక్కర్ బాంబులు, టైమ్ బాంబులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు పట్టుబడిన ఇల్లు షాహిద్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తెలిపారు. అతడి ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతుండడంతో కొన్ని రోజులుగా అతడి ఇంటిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ముఖ్యంగా వసీం అనే వ్యక్తి అతడి ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో మరింతగా నిఘా పెట్టారు. వారంతా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఇవాళ ఇంటిపై దాడి చేసి.. వారిని అరెస్ట్ చేశారు. వీరంతా ఏదో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ATS UP has uncovered a big terror module. The team has arrested two terrorists linked with al-Qaeda's Ansar Ghazwat-ul-Hind. Cache of arms, explosive materials recovered: Prashant Kumar, ADG Law and Order, UP, on Lucknow ATS' operation in Kakori today. pic.twitter.com/2kXH4Bok2V
— ANI UP (@ANINewsUP) July 11, 2021
యూపీలో గత కొన్నేళ్లుగా అల్ ఖైదా స్లీపర్ సెల్స్ పట్టుబడతూనే ఉన్నారు. 2017లో సైఫుల్లా అనే ఉగ్రవాదిని యూపీలో ఎన్‌కౌంటర్ చేశారు. ఆ ఏడాది మార్చి 8న 11 పాటు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టి అతడిని మట్టుబెట్టారు. ఇక ఇటీవల దర్భంగా రైల్వే స్టేషన్ బాంబు పేలుడు కేసులోనూ హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ యూపీకే చెందిన వారే కావడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Terrorists, UP police