పీవోకే నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల భారీ స్కెచ్...

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఎలాగైనా ఉగ్రవాదులను భారత భూభాగంలో ప్రవేశ పెట్టి కల్లోలం సృష్టించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే లోయలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సాధారణ జీవితం నెలకొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శ్రీనగర్ లో నే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

news18-telugu
Updated: August 11, 2019, 8:23 PM IST
పీవోకే నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల భారీ స్కెచ్...
ప్రతీకాత్మక చిత్రం(File Image : PTI)
  • Share this:
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని, మఖ్యంగా రాత్రి వేళల్లో సరిహద్దు దాటి కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భారత సైన్యం పేర్కొంది. ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాదులతో నిండిపోయాయని, ఎలాగైనా సరిహద్దు దాటాలని చూస్తున్నప్పటికీ సరిహద్దు పహారా దళాలు వారి ప్రయత్నాలను తిప్పి కొడుతున్నామని శ్రీనగర్‌లోని కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అలాగే పాక్ వైపు నుంచి కాల్పులు జరిగితే సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వారి రక్షణ కోసం నియంత్రణ రేఖ వెంబడి మరిన్ని బంకర్లను ఏర్పాటు చేసేలా ఉన్నత స్థాయి రక్షణ అధికారులకు తెలిపినట్లు ఆయన అన్నారు. అలాగే పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు చేసినా వాటిని సమర్థవంతంగా తిప్పిగొడతామనని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఎలాగైనా ఉగ్రవాదులను భారత భూభాగంలో ప్రవేశ పెట్టి కల్లోలం సృష్టించాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే లోయలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సాధారణ జీవితం నెలకొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శ్రీనగర్ లో నే ఉండి పర్యవేక్షిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: August 11, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading