మరోసారి భారత్-చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోని LAC సమీపంలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఇరుదేశాల సైనికులు ఘర్షణ గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో 30 మంది భారత జవాన్లు గాయపడినట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఈ ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవి చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు. చైనా సైనికులు మనం భూభాగంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పి కొట్టిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. తవాంగ్ ఘటనలో చైనా, ఇండియాకు చెందిన సైనికులు గాయపడినట్టు రాజ్ నాథ్ తెలిపారు.
డిసెంబర్ 9న అసలేం జరిగింది?
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోని LAC సమీపంలో డిసెంబర్ 9న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన బలగాలను మోహరించింది. చైనా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత ఆర్మీ సిబ్బంది సూచించింది. దీనితో తదుపరి పురోగతి గట్టిగా నిరోధించారు. ఈ క్రమంలో ఇరు జవాన్లు కాల్పులు జరపగా పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో 30 మంది భారత జవాన్ల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే భారత సైన్యానికి రెట్టింపు చైనా సైనికులు గాయపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
గాల్వాన్ లోయ ఘటన తర్వాత..
లద్దాఖ్ లోని గాల్వాయ్ లోయలో కూడా రెండేళ్ల క్రితం భారత్-చైనా సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎవరు మరణించారని నివేదికలు లేనప్పటికీ పలువురు గాయాలపాలయ్యారు. అయితే ఆ సమయంలో భారత ఆర్మీ చైనా అధికారులతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. ఇక తాజాగా మరోసారి ఇండియా-చైనా జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పార్లమెంట్ లో దుమారం..
భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘటనతో పార్లమెంట్ లో దుమారం రేగింది. ఈ అంశంపై ఎందుకు చర్చించడం లేదని కాంగ్రస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దుల వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, India, India-China, Indian Army