జూన్‌లో 28-29 తేదీల్లో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశం (47th GST Council meeting)లో అనేక మార్పులకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ మార్పులన్నీ 2022 జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే వాటిలో రూమ్ రెంట్‌పై 18 శాతం జీఎస్‌టీ (Goods and Services Tax) అనే మార్పు కూడా ఉంది. ఈ జీఎస్‌టీ చెల్లింపు విషయంలో చాలా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అద్దె చెల్లింపుపై కొత్త జీఎస్‌టీ (GST) నిబంధనలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే కొద్ది రోజులుగా హౌజ్ రెంట్‌కు ఉండే ప్రతి ఒక్కరూ అద్దెపై తప్పనిసరిగా 18% జీఎస్‌టీ కట్టాలంటూ సోషల్ మీడియాలో నివేదికలతో పాటు మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో సాధారణ ప్రజలు మరింత అయోమయంలో పడిపోయారు. కాగా ఈ ఈ నివేదికలన్నీ అవాస్తవమే (Fake) అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) తాజాగా స్పష్టం చేసింది.
రెసిడెన్షియల్ యూనిట్‌ని వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని PIB ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇంటి రెంటుపై జీఎస్‌టీ చెల్లించనక్కర్లేదని వెల్లడించింది. అలానే అద్దెపై జీఎస్‌టీకి సంబంధించి మూడు ముఖ్యమైన విషయాలపై పీఐబీ (PIB) స్పష్టత ఇచ్చింది.
1. రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఏదైనా వ్యాపార సంస్థ (Business Organization)కు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే అద్దెపై పన్ను వర్తిస్తుంది.
2. వ్యక్తిగత అవసరాల కోసం అద్దెకు ఉండే వ్యక్తులెవరూ GST కట్టాల్సిన అవసరం లేదు.
3. ఏదైనా వ్యాపార సంస్థ యజమాని లేదా భాగస్వామి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇంటిని అద్దెకు తీసుకున్నా GST వర్తించదు.
పైన పేర్కొన్న పాయింట్స్ ప్రకారం, వ్యాపార సంబంధిత అవసరాల కోసం అద్దెకు తీసుకున్న ప్రాపర్టీల విషయంలోనే అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా జీఎస్టీలో రిజిస్టర్ అయిన వారికే వర్తిస్తుంది. వేతన జీవులు జీఎస్టీలో రిజిస్టర్ అవ్వరు కాబట్టి వారికి ఈ జీఎస్టీ వర్తించదు. ఇక అద్దెకు ఉండే వారు ఈ నిబంధనలు తప్పక తెలుసుకోవాలి. ఈ అద్దె విషయానికి సంబంధించి, లేదా ఇతర ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద లింక్స్ వస్తే.. వాటిని క్లిక్ చేయకపోవడమే శ్రేయస్కరమని PIB ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మెసేజ్‌ల నిజ నిర్ధారణ చేయడం ఎలా?
తెలియని నంబర్ నుంచి ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే.. మీరు దానిలో ఉన్న నిజమెంత అనేది తెలుసుకోవచ్చు. ఫలానా వార్త నిజమా? లేదా ఫేక్ వార్తా? అనేది తీసుకోవడానికి ప్రజలు https://factcheck.pib.gov.inకి మెసేజ్ పంపాలి. లేదంటే మీరు ఫ్యాక్ట్ చెక్ కోసం +918799711259కి వాట్సాప్ మెసేజ్ పంపినా సరిపోతుంది. మీరు మీ మెసేజ్‌ని pibfactcheck@gmail.comకి కూడా పంపవచ్చు. ఫ్యాక్ట్ చెక్ సమాచారం https://pib.gov.inలో కూడా అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.