Home /News /national /

TEN WOMEN AGED 50 67 PLAN AN EXPEDITION OF HIMALAYAN PROPORTIONS GH VB

Himalayan Expedition: మలి వయసులో హిమాలయాలపై సాహసయాత్ర.. 50 ఏళ్లు పైబడిన 10 మంది మహిళల ప్రయాణం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా 50 ఏళ్లు దాటాక మహిళల్లో సత్తువ అనేది క్షీణించడం సహజం. ఈ వయసు వారు ఇంటి పనులు చేయగలుగుతారేమో గానీ సాహసయాత్రలు (expeditions) వంటివి చేయడం దాదాపు అసాధ్యం. అయితే తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు పదిమంది మహిళలు సిద్ధమయ్యారు.

ఇంకా చదవండి ...
సాధారణంగా 50 ఏళ్లు దాటాక మహిళల్లో సత్తువ అనేది క్షీణించడం సహజం. ఈ వయసు వారు ఇంటి పనులు చేయగలుగుతారేమో గానీ సాహసయాత్రలు (expeditions) వంటివి చేయడం దాదాపు అసాధ్యం. అయితే తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు పదిమంది మహిళలు సిద్ధమయ్యారు. వీరందరూ కలిసి హిమాలయ పర్వతశ్రేణుల (trans-Himalayan) మీదగా సుదీర్ఘమైన సాహసయాత్ర ప్లాన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ డిఫికల్ట్ జర్నీని ప్రముఖ పర్వతారోహకురాలు బచేంద్రిపాల్ (Bachendri Pal) ప్లాన్ చేశారు. 1984లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన బచేంద్రి పాల్.. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ మహిళగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 67 ఏళ్ల వయసున్న బచేంద్రి తన స్నేహితులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు 4,500 కి.మీ ట్రాన్స్-హిమాలయన్ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమయ్యే ఈ సాహసయాత్ర ఐదు నెలల పాటు కొనసాగనుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Viral News: ఆ బుడతడు చేసిన పనికి మీరు షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ.1.4 లక్షలతో..


బచేంద్రి పాల్ సరిగ్గా రెండేళ్ల క్రితం తన స్నేహితులకు ఒక సాహస యాత్ర గురించి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. "అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు 4,500 కి.మీ ట్రాన్స్-హిమాలయన్ యాత్రను నాతో పాటు కలిసి చేస్తారా?" అని ఆమె 50-70 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలను సూటిగా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా "ఏంటి తమాషా చేస్తున్నావా?" అని వారంతా మొదట్లో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారట. "ఎలాంటి తమాషాలు చేయడం లేదు. నిజంగానే ప్లాన్ చేద్దాం" అని పాల్ చెప్పేసరికి వారు కూడా ఒప్పుకున్నారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావంవల్ల ఈ ప్లాన్‌ను అందరూ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో బచేంద్రి పాల్ తన మహిళల బృందంతో కలిసి ఈ మార్చిలో జీవితకాల సాహసానికి సిద్ధమవుతున్నారు.

పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత అయిన బచేంద్రి పాల్ ఇటీవల తన స్నేహితులను మహారాష్ట్రలోని వార్ధాలో ఒక ఈవెంట్ లో కలుసుకున్నారు. ఈ సమయంలో యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. " 'ఫిట్ ఇండియా' ప్రచారంతో ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారు కూడా శారీరకంగా దృఢంగా ఉంటారని మేం చూపించాలనుకుంటున్నాం,” అని పాల్ చెప్పారు.

ఈ సాహస యాత్రలో పాల్గొనే మిగతా మహిళలు సామాన్యులేం కాదు. ఆమె స్నేహితుల్లో చాలామంది నిష్ణాతులైన పర్వతారోహకులు ఉన్నారు. వారిలో కొందరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. కొందరు ఎవరెస్ట్ ప్రీ-ట్రెక్‌లలో పాల్గొని రాటుదేలారు. ఈ ప్రణాళిక ఉత్తేజకరమైనది, కానీ వారి వయస్సు వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేసింది. 2016లో తన భర్త ప్రదీప్‌తో కలిసి ఎవరెస్ట్‌ను అధిరోహించిన కోల్‌కతాకు చెందిన చెత్నా సాహూ (54) మాట్లాడుతూ “ఈ యాత్రను పూర్తి చేయడానికి దాదాపు ఐదు నెలలు పడుతుంది. నేను మార్గాన్ని మ్యాప్ చేసాను. ట్రాన్స్-హిమాలయన్ యాత్రకు అనేక పాస్‌లను దాటడం అవసరం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మేం మార్చిలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్రారంభించి, దాదాపు ఐదు నెలల తర్వాత టైగర్ హిల్ (కార్గిల్ వార్ ఫేమ్) వద్దకు చేరుకుంటాం, ” అని వెల్లడించారు.

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన గిరిజన యువకులకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు శిక్షణ ఇస్తున్న బిమ్లా నేగి-దియోస్కర్ అనే మహిళ కూడా సాహసయాత్రలో పాల్గొంటోంది. “సాధారణంగా మీరు 50 ఏళ్ల వయసు దాటాక విశ్రాంతి తీసుకోవడం, రిటైర్డ్ జీవితంలో స్థిరపడడంపై దృష్టి దృష్టి సారిస్తారు. కానీ రిటైర్‌మెంట్ అనేది నూతన జీవితానికి నాంది అని భావించాలి. కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇదే ఆ సరైన సమయంగా భావించాలి.” అని నాగ్‌పూర్‌కు చెందిన 54 ఏళ్ల బిమ్లా అన్నారు.

మార్చి 8 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' తేదీన బచేంద్రిపాల్‌ తన 67వ వసంతంలోకి అడుగు పెడతారు. ఇదే తేదీన ఈ హిమాలయన్ యాత్ర ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన ఈ ప్రయాణం ఏకంగా ఐదు నెలల పాటు 37 పర్వత మార్గాల గుండా 4,500 కిలోమీటర్లకు పైగా సాగనుంది. అత్యంత ప్రతికూలంగా ఉండే ఈ పర్వతాల గుండా వయసు పైబడిన మహిళలు ప్రయాణం చేయడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Viral, VIRAL NEWS, Viral photos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు