TEMPLE FOR PRIME MINISTER NARENDRA MODI IN MUZAFFARNAGAR MK
ప్రధాని మోదీకి గుడి కడతామంటున్న ముస్లిం మహిళలు...ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మకచిత్రం
ప్రధాని మోదీ పేరు మీద క్రిష్ణ పూరి ప్రాంతంలో తమ సొంత స్థలంలో గుడి నిర్మిస్తామని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే యుఎఇ ప్రభుత్వం అత్యున్నత పౌర పురష్కారంతో ప్రధాని మోదీని సత్కరించడంతో… ఈ ఆలోచన వచ్చిందని వారు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో కొందరు ముస్లిం మహిళలు ప్రధాని మోదీ పేరిట మీద గుడి నిర్మిస్తామని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమర్ గజ్నీ, రుబీ గజ్నీ అనే వీరిని బిజెపి కార్యకర్తలుగా గుర్తించారు. దేశం కోసం మోదీ ఎంతో శ్రమిస్తున్నారని అందుకే ఆయనకు మందిరం నిర్మిస్తామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ పేరు మీద క్రిష్ణ పూరి ప్రాంతంలో తమ సొంత స్థలంలో గుడి నిర్మిస్తామని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే యుఎఇ ప్రభుత్వం అత్యున్నత పౌర పురష్కారంతో ప్రధాని మోదీని సత్కరించడంతో… ఈ ఆలోచన వచ్చిందని వారు తెలిపారు. మోదీకి మందిరం నిర్మించడమే కాకుండా ఆయన జీవిత చరిత్ర విషయాలను మందిరంలో పొందుపరుస్తామని, అందులో మోదీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.