హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేసిన ప్రాంతంలో ఏం నిర్మించనున్నారు ?.. RW అధ్యక్షుడు ఏం చెప్పారంటే..

Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేసిన ప్రాంతంలో ఏం నిర్మించనున్నారు ?.. RW అధ్యక్షుడు ఏం చెప్పారంటే..

ట్విన్ టవర్స్ కూల్చివేత

ట్విన్ టవర్స్ కూల్చివేత

Twin Towers: ట్విన్ టవర్స్ వైశాల్యం 75000 చదరపు మీటర్లు. ఈ భూమిని బిల్డర్ ఇంకా సొసైటీకి అప్పగించలేదని సమాచారం. దీనిపై యాజమాన్యం ఇప్పటికీ బిల్డర్ వద్ద ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అవినీతికి నిదర్శనంగా నిలిచిన సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్‌ కూల్చివేసింది. ఇందుకోసం బిల్డర్‌కు, ఆర్‌డబ్ల్యూఏకు మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుతో వీటిని కచ్చితంగా కూల్చాలని పరిస్థితి ఏర్పడింది. ట్విన్ టవర్స్(Twin Towers) కూల్చేయడంతో.. ఇక అక్కడ ఏం నిర్మిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటువంటి పరిస్థితిలో RW అధ్యక్షుడు న్యూస్18తో మాట్లాడారు. ట్విన్ టవర్స్ స్థానంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. జంట టవర్ సైట్‌లో పిల్లల కోసం ప్లే గ్రౌండ్‌ను నిర్మిస్తామని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ RWA అధ్యక్షుడు ఉదయ్ భన్ సింగ్ టియోటియా తెలిపారు. దీంతోపాటు గ్రీన్ పార్క్ కూడా ఉంటుందని వెల్లడించారు. అలాగే సంఘ ప్రజల సహకారంతో గొప్ప ఆలయాన్ని(Temple) నిర్మిస్తామన్నారు. అందులో అన్ని దేవుళ్ల విగ్రహాలు ఉంటాయని చెప్పారు. ఇందుకోసం వారం రోజుల పాటు ఆర్‌డబ్ల్యూఏ సమావేశం నిర్వహించాలని, సభ్యులందరి అంగీకారం మేరకు నిర్ణయం అమల్లోకి రానుందని తెలిపారు.జంట టవర్ వైశాల్యం 75000 చదరపు మీటర్లు. ఈ భూమిని బిల్డర్ ఇంకా సొసైటీకి అప్పగించలేదని సమాచారం. దీనిపై యాజమాన్యం ఇప్పటికీ బిల్డర్ వద్ద ఉంది. అయితే బిల్డర్ ఈ భూమిలో ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే, దాని కోసం అతను సొసైటీలోని మూడింట రెండు వంతుల నివాసితుల నుండి సమ్మతి తీసుకోవాలి.


  మరోవైపు ఆర్‌డబ్ల్యూఏ ఆఫీస్ బేరర్లు మాత్రం తమకు సమాజం అండగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఏదైనా న్యాయ పోరాటం చేయాల్సి వస్తే అందులో వెనక్కి తగ్గేది లేదు. ఇక్కడ ముందుగా నిర్ణయించిన పార్కును నిర్మించనున్నారు. దీనితో పాటు ఆలయాన్ని కూడా నిర్మించనున్నారు.
  Noida Twin Towers: పేలుడుకు గంట ముందే కీలక ప్రకటన చేసిన రియల్టర్ సూపర్ టెక్.. అదేంటంటే..
  Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం..100 మీటర్ల భవనాలు.. 10 సెకన్లలోనే ఫసక్..
  గత ఆదివారం నోయిడాలోని సెక్టార్ 93-Aలో ఉన్న ట్విన్ టవర్స్ కేవలం 10 సెకన్లలోనే నేలమట్టమయ్యాయి. ఎడిపైస్ సంస్థ (Edifice) వీటిని పడగొట్టింది. మన దేశానికి చెందిన బ్లాస్టర్ చేతన్ దత్తా (Chetan Dutta) సరిగ్గా మధ్యాహ్నం 02.30 నిమిషాలకు బటన్ నొక్కి ట్విన్ టవర్స్‌ని కూల్చేశారు. ట్విన్ టవర్స్ పేల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లోని 9,600 ప్రాంతాల్లో రంధ్రాలు చేసి..పేలుడు పదార్థాలను అమర్చారు. వాటర్‌ఫాల్స్ ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించి.. భవనాలను నిట్టనిలువుగా పడగొట్టారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పక్కన ఉండే భవనాలకు నష్టం కలగలేదు. ఉన్న చోటే.. నిట్టనిలువుగా.. పడిపోయాయి. ఎడిఫైస్ సంస్థ, నోయిడా అధికార యంత్రాంగం, పోలీసులు కలిసికట్టుగా పనిచేసి.. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనుకున్న సమయానికే అనుకున్నట్లుగానే వాడిని పడగొట్టారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Noida Twin Towers

  ఉత్తమ కథలు