Home /News /national /

TELUGU JAWAN RAJA SEKHAR AMONG KASHMIR ITBP BUSS ACCIDENT DECEASED HERE ARE MORE DETAILS SK

Kashmir Bus Accident: కాశ్మీర్ ITBP బస్సు ప్రమాద మృతుల్లో తెలుగు జవాన్.. కడపలో విషాద ఛాయలు

ITBP కానిస్టేబుల్ రాజశేఖర్

ITBP కానిస్టేబుల్ రాజశేఖర్

ITBP Bus Accident: ఐటీబీపీ జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో 30 మంది జవాన్లు గాయపడ్డారు. ఐతే మరణించిన వారిలో తెలుగు జవాన్ కూడా ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    జమ్మూకాశ్మీర్‌లో (Jammu kashmir Bus Accident) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఐటీబీపీ జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో (ITBP Bus Accident) పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా.. మరో 30 మంది జవాన్లు గాయపడ్డారు. ఐతే మరణించిన వారిలో తెలుగు జవాన్ కూడా ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ ఐటీబీపీ బస్సు ప్రమాదంలో మరణించారు.



    బస్సు ప్రమాదంలో మరణించిన జవాన్లను....  హెడ్ కానిస్టేబుల్ దులా సింగ్ (తరణ్ తరణ్, పంజాబ్), కానిస్టేబుల్ అభిరాజ్ (లఖిసరాయ్, బీహార్), కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఎటా, యుపి), కానిస్టేబుల్ డి. రాజ్ శేఖర్ (కడప, ఆంధ్రప్రదేశ్), కానిస్టేబుల్ సుభాష్ బైర్వాల్ ( సికార్, రాజస్థాన్ ), కానిస్టేబుల్ దినేష్ బోహ్రా (పితోరాగఢ్, ఉత్తరాఖండ్), కానిస్టేబుల్ సందీప్ కుమార్ (జమ్ము డివిజన్)గా గుర్తించారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఐటీబీపీ కానిస్టేబుల్ రాజ శేఖర్ మృతితో కడప జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

     కూతురినే రేప్ చేస్తావా అని సమాజమంతా ఛీకొట్టింది.. కానీ ఐదేళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..!



    మంగళవారం, జమ్మూకాశ్మీర్‌లోని  చందన్‌వాడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోయలో పడింది.  ప్రమాద తీవ్రత ధాటికి బస్సు తునాతునకలయింది. ఐతే అదృష్టవశాత్తు చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు జవాన్లు మాత్రం అమరులయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది జవాన్లు ఉన్నారు.  37 మంది ఐటీబీపీకి చెందిన వారు కాగా.. ఇద్దరు జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన వారు. వీరంతా అమర్‌నాథ్ యాత్రకు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం విధులు ముగించుకొని.. చందన్‌వాడీ నుంచి పహల్‌గామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఆర్మీ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలకు స్వాధీనం చేసుకొని శ్రీనగర్‌కు తరలించింది. గాయపడ్డ వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఐటీబీపీ ఉన్నతాధికారులు తెలిపారు.

    Vultures Death: గేదెకు విషంపెట్టి చంపి.. దానిని ఎరగా వేసి 100 రాబందులను చంపేశారు..

    మరణించిన జవాన్లు


    చందన్‌వాడీ బస్సు ప్రమాదంలో మరణించిన జవాన్ల పార్థివ దేహాలు బుధవారం శ్రీనగర్‌కు చేరుకున్నాయి. ఐటీబీపీ సిబ్బంది పార్థివ దేహాలను ఆర్మీ సిబ్బంది తీసుకొస్తుండగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా భుజం పట్టారు. అక్కడ నివాళుల అనంతరం.. ఢిల్లీకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాను పార్థివదేహాలను పంపిస్తారు. రాజశేఖర్ భౌతికకాయం ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి కడప చేరుకునే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bus accident, Itbp, Jammu and Kashmir

    తదుపరి వార్తలు