లండన్‌లో వెల్లివిరిసన దాత‌ృత్వం.. తెలుగు విద్యార్థులకు సాయం

తెలుగు విద్యార్థులకు సాయం చేస్తున్న తాల్ ప్రతినిధులు

తాల్(తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్) కోవిడ్-19 వల్ల లండన్ చుట్టూపక్కల ప్రాంతాల్లో ప్రభావితమైన విద్యార్థులకు కిరాణా సామగ్రిని ఈస్ట్ లండన్‌లో పంపిణీ చేశారు.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలు వెళ్లిన వలస కూలీలే కాకుండా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లోని విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన తాల్(తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్) కోవిడ్-19 వల్ల లండన్ చుట్టూపక్కల ప్రాంతాల్లో ప్రభావితమైన విద్యార్థులకు కిరాణా సామగ్రిని ఈస్ట్ లండన్‌లో పంపిణీ చేశారు. తాల్ ప్రతినిధులు రవి మోచర్ల, సత్యేన్ద్ర పగడాల ఆధ్వర్యంలో తాల్ స్వయం సేవకులు వివిధ దేశాలకు చెందిన సుమారు 400 విద్యార్థులకు ఈ పంపిణీ చేశారు. శరవన్ భవన్ అధినేతలు శివకుమార్, రేఖ విక్కి, శక్తి స్టోర్స్ నుంచి సురేష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయం చేశారు. విద్యార్థులు ఈ ఆపద సమయంలో ఆదుకున్నందుకు తాల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తాల్ ఈ విధమైన సహాయం ఆందించడానికి ఎల్లప్పుడూ ముందు వరసలో ఉంటుందని చెప్పారు. కేవలం తెలుగు విద్యార్థులకే పరిమితం అవ్వకుండా, అంతర్జాతీయ విద్యార్థులకు కూడా తోడ్పాటు అందించి విశ్వమానవతా భావం చాటింది. వేరే ప్రాంతాల్లో కూడా ఈ విధమైన సహాయక కార్యక్రమాలు అందిచబోతోందని తాల్ చైర్మన్ సోమిశెట్టి శ్రీధర్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి ఉదారంగా విరాళాలు అందించిన దాతలు రవి మోచర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published: