news18-telugu
Updated: December 28, 2019, 3:22 PM IST
ప్రతీకాత్మక చిత్రం
జాతీయ పౌర పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా అసోం,ఉత్తరప్రదేశ్,ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా ఆయా ప్రాంతాల్లో తరుచూ ఇంటర్నెట్ షట్డౌన్ చేయాల్సి రావడంతో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI) లెక్కల ప్రకారం.. ఆ నష్టం విలువ ఒక గంటకు అక్షరాలా 2.45కోట్లు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో 2019 చివరి వరకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ కారణంగా ఇంత భారీ నష్టం వాటిల్లినట్టు COAI సంస్థ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని 18 ప్రాంతాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయని టెలికాం
కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని గృహ సముదాయాలకు డిసెంబర్ 28 వరకు ఇంటర్నెట్ నిలిపివేయాల్సిందిగా ఓ ప్రముఖ ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీకి ఆదేశాలు జారీ అయినట్టు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
కాగా,భారత్లో స్మార్ట్ఫోన్ వినియోగదారులు సగటున ఒక నెలకు 9.8 గిగాబైట్ల ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇది ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే అత్యధికం అని స్వీడిష్ టెలికాం గేర్మార్కర్ ఎరిక్సన్ అనే సంస్థ వెల్లడించింది. దేశంలో ఫేస్బుక్,వాట్సాప్,ఇతర సోషల్ మీడియా యూజర్స్ ఎక్కువగా ఉండటంతో.. ఇంటర్నెట్ షట్డౌన్స్ టెలికాం కంపెనీలకు ఆర్థిక సమస్యలను తెచ్చి పెడుతున్నాయి.
Published by:
Srinivas Mittapalli
First published:
December 28, 2019, 1:00 PM IST