హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

'మద్యం డోర్ డెలివరీ'పై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు

'మద్యం డోర్ డెలివరీ'పై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు

 వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు మంత్రి.

వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు మంత్రి.

వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు మంత్రి.

    లాక్‌డౌన్‌లో మద్యం షాపులు తెరవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మందు బాబులు కరోనా క్యారియర్లుగా మారే అవకాశముందని.. కరోనా మరంత వ్యాప్తి చెందే ప్రమాదముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డోర్ డెలివరీని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు అప్పటికే ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ లిక్కర్ సేల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తామని చెప్పారు. అధికారులతో సమీక్ష నిర్వహించి డోర్ డెలివరీ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్.

    రాష్ట్రంలో కరోనా కేసులు మరింతగా పెరిగితే మద్యం అమ్మకాల మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుంటే.. ఆ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇక ఇప్పటికే టూరిజం నష్టాల్లో కూరుకుపోయిందని.. త్వరలో హోటల్ రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్. కాగా, లాక్‌డౌన్-3 మార్గదర్శకాల్లో పలు రంగాలకు కేంద్రం సడలింపులు ఇవ్వడంతో తెలంగాణలో మద్యం షాపులు తెరచుకున్నాయి. మే 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఐతే కొన్ని చోట్ల భారీగా క్యూలైన్లు కనిపించడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మద్యం డోర్ డెలివరీ అవకాశాన్ని పరిశీలిస్తామని ఎక్సైజ్ మంత్రి చెప్పారు.

    First published:

    Tags: Liquor sales, Liquor shops, Telangana, Wine shops

    ఉత్తమ కథలు