TELANGANA ENCOUNTER MHA SEEKS REPORT FROM TELANGANA GOVERNMENT NK
ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వాన్ని రిపోర్ట్ కోరిన కేంద్రం
ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వాన్ని రిపోర్ట్ కోరిన కేంద్రం
Telangana Encounter : తెలంగాణ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగానే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అదీ లెక్క అంటూ చాలా మంది పోలీసుల్ని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ దీనిపై రిపోర్ట్ కోరింది.
Telangana Encounter : తెలంగాణలో దిశ హత్యాచారం హత్య కేసులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 3న్నర గంటల సమయంలో... షాద్‌నగర్‌లోని చటాన్ పల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. మూడు గంటలకు నిందితులు నలుగురినీ తీసుకొని... దిశ హత్య, అత్యాచారం జరిగిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తుండగా... చటాన్ పల్లిలో... పోలీసుల నుంచీ తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నిస్తూ... పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు నిందితులు నలుగురూ ప్రయత్నిస్తుండగా... తాము కాల్పులు జరిపామనీ, ఆ కాల్పుల్లో నలుగురు నిందితులూ చనిపోయారన్నది పోలీసుల వాదనగా తెలిసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పోలీసులు మంచి పని చేశారనీ, తెలంగాణ పోలీసులు సూపరని చాలా మంది మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖులంతా దిశకు న్యాయం జరిగిందని ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. చాలా విదేశాల్లో కూడా అలా జరిగిందంట అని చెప్పుకుంటున్నారు. ఐతే... ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా... కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచీ కోరుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.
జనరల్‌గా శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాకపోతే... ఓ ప్రదేశంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు అధికారికంగా కేంద్రం ఓ నివేదికను తీసుకుంటుంది. ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు కేంద్ర హోంశాఖ నివేదిక కోరినట్లు తెలిసింది. ఐతే... ప్రస్తుతం నిందితులకు పోస్ట్ మార్టం జరుగుతోంది. ఆ తర్వాత వచ్చే రిపోర్ట్‌ను జతచేసి... పోలీసులు ఓ నివేదికను కేంద్రానికి సమర్పిస్తారని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.