ఈవీఎంలు బస్సును ఎత్తుకెళ్లాయి..హోటల్‌లో మందుకొట్టాయి: రాహుల్

Telangana assembly elections 2018: పోలింగ్ పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలను నేరుగా స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకెళ్లలేదని..రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఈవీఎంలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లారన్నది రాహుల్ ప్రధాన ఆరోపణ.

news18-telugu
Updated: December 7, 2018, 5:13 PM IST
ఈవీఎంలు బస్సును ఎత్తుకెళ్లాయి..హోటల్‌లో మందుకొట్టాయి: రాహుల్
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: December 7, 2018, 5:13 PM IST
తెలంగాణ, రాజస్థాన్‌లో పోలింగ్ వేళ ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెటైరికల్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈవీఎంలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించాయని..తెలంగాణ, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాక..ఈవీఎంలు ఎక్కడెక్కడికో వెళ్లాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో ఈవీఎంలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయని..మోదీపై సెటైర్ వేశారు రాహుల్.

ఇవాళ ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల పూర్తయ్యాక ఈవీఎంలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించాయి. కొన్ని ఈవీఎంలు బస్సులను దొంగిలించి రెండు రోజుల పాటు మాయమయ్యాయి. మరికొన్ని హోటల్‌లో తాగుతూ కనిపించాయి. ఇది మోడీ ఇండియా. ఈవీఎంలకు అతీత శక్తులున్నాయి. జర జాగ్రత్త.
రాహుల్ గాంధీ

Loading...

పోలింగ్ పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలను నేరుగా స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకెళ్లలేదని..రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఈవీఎంలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లారన్నది రాహుల్ ప్రధాన ఆరోపణ.ఈ నేపథ్యంలో తెలంగాణ, రాజస్థాన్‌లోని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...