HOME »NEWS »NATIONAL »tejaswi yadav sensational comments on election commission regarding bihar assembly elections 2020 ak

Tejaswi Yadav: ఎన్నికల సంఘంపై తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు

Tejaswi Yadav: ఎన్నికల సంఘంపై తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్(Photo: Twitter)

Tejaswi Yadav: బీహార్ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు.

  • Share this:
    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి 119 స్థానాలు గెలిచిందని ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నారు. అయితే అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించిందని సంచనల ఆరోపణలు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన తేజస్వి యాదవ్.. బిహార్ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని వ్యాఖ్యానించారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని.. 2015లోనూ ఇలాగే జరిగిందని అన్నారు.

    తమ కూటమికి ఓటు వేసిన బిహార్ ప్రజలకు తేజస్వి యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుందని... అధికారం కోసం ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది మహాకూటమికి అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. తమ అభ్యర్థులే గెలిచారనడానికి ఆర్జేడీ కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఫలితాలు విడుదల చేసిన రాత్రి ఈసీ మీడియా సమావేశం నిర్వహించి దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు విధానంలో ఎలాంటి లోపాలు లేవని వెల్లడించింది. దీనిపై పదేపదే వివరణ ఇవ్వలేమని ఈసీ పేర్కొంది.



    243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో.. ఎన్డీయే 125 సీట్లు సాధించింది. మహాకూటమి 110 సీట్లు దక్కించుకుంది. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4, CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి. మ్యాజిక్ మార్క్ 122 కంటే మూడు సీట్లు ఎక్కువ గెలవడంతో.. ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:November 12, 2020, 15:50 IST