విమానంలో మాజీ సీఎం కుమారుడి విలాసాలు...ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్...

మరో నెటిజన్ అయితే ఒక అడుగు ముందుకేసి మీ నాన్న జైలులో ఉంటే నువ్వు ప్రైవేట్ విమానంలో నీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నావా అంటూ చురకలు అంటించాడు.

news18-telugu
Updated: November 11, 2019, 7:13 PM IST
విమానంలో మాజీ సీఎం కుమారుడి విలాసాలు...ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్...
విమానంలో మాజీ సీఎం కుమారుడి విలాసాలు...ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్...
  • Share this:
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రైవేటు విమానంలో జరుపుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తేజస్వి యాదవ్ శనివారం రాంచి నుంచి పాట్నాకు ఒక ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకుని అందులో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అంతేకాదు విమానంలో తేజస్వి కేక్ కట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్త బట్టలు ధరించిన తేజస్వి తన స్నేహితులతో కలసి విమానంలో పార్టీ చేసుకున్నారు. అయితే తేజస్విపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బీహార్‌కు చెందిన పేద ప్రజలకు ఇతను నాయకుడా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. మరో నెటిజన్ అయితే ఒక అడుగు ముందుకేసి మీ నాన్న జైలులో ఉంటే నువ్వు ప్రైవేట్ విమానంలో నీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నావా అంటూ చురకలు అంటించాడు.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు