హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tejashwi Yadav Birthday: నేడు తేజస్వీ యాదవ్ బర్త్‌డే. రేపు ప్రజలు గిఫ్ట్ ఇస్తున్నారా?

Tejashwi Yadav Birthday: నేడు తేజస్వీ యాదవ్ బర్త్‌డే. రేపు ప్రజలు గిఫ్ట్ ఇస్తున్నారా?

తేజస్వీ యాదవ్ (File - credit - twitter)

తేజస్వీ యాదవ్ (File - credit - twitter)

Tejashwi Yadav Birthday: తన చిన్న కొడుకు తేజస్వీ యాదవ్‌కు శుభాకాంక్షలు చెప్పిన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్... మంగళవారం బీహార్ ప్రజలు గిఫ్టు ఇస్తారని అన్నారు.

Tejashwi Yadav Birthday: బీహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సారధి తేజస్వీ యాదవ్ టైమ్ ఓ రేంజ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆర్జేడీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్కువ మంది అంచనా వేయగా... ఇవాళ తన 31వ పుట్టిన రోజున తేజస్వీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రేపు ప్రజలు ఆయనకు పుట్టిన రోజు గిఫ్టు ఇవ్వబోతున్నారనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయాల్లో తలపండిన నితీశ్ కుమార్‌కి గట్టి పోటీ ఇచ్చిన తేజస్వీ యాదవ్... ముఖ్యమంత్రి రేసులో ముందున్నాడు. ఆయన సీఎం అవుతారనే అంచనాలున్న సమయంలో... తన చిన్న కొడుకును ఆశీర్వదించిన లాలూ ప్రసాద్ యాదవ్... మంగళవారం బీహార్ ప్రజలు గిఫ్టు ఇస్తారని అన్నారు. నిజానికి తన తండ్రిని కలిసేందుకు తేజస్వీ మూడుసార్లు ప్రయత్నించారు. నిన్న రాత్రి 12 గంటలప్పుడు వెళ్లగా... అప్పటికే లాలూ నిద్రపోయారు.

తెల్లవారు జాము 6 గంటలకు వెళ్లినా... ఆ సమయంలో మాట్లాడేందుకు వీలు కాలేదు. దాంతో... మూడోసారి తండ్రికి కాల్ చేశాడు. దాంతో... లాలూ స్వయంగా శుభాకాంక్షలు చెప్పి... ఈసారి పుట్టిన రోజు నీకు ప్రత్యేకం కాబోతోందని అన్నట్లు తెలిసింది. మంగళవారం నాటి ఫలితాల్లో... ప్రతి ఒక్కరూ నీకు గిఫ్టు ఇస్తారు అని లాలూ చమత్కరించినట్లు తెలిసింది.

ప్రజలతో కలిసి పుట్టిన రోజు జరుపుకోమని లాలూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. దాదాపు అరగంటపాటూ... లాలూ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లే ఫలితాలు వస్తే మాత్రం... తేజస్వీ యాదవ్ సీఎం అవ్వడం ఖాయం. ఎన్నికల ఫలితాలు మంగళవారం వస్తాయి కాబట్టి... నవంబర్ 11న మరోసారి రాంచీలో తన తండ్రిని కలిసి ఆశీర్వాదం పొందాలని తేజస్వీ యాదవ్ భావిస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 27 వరకూ... లాలూ ప్రసాద్ జైల్లో ఉంటారు. నవంబర్ 27న బెయిల్ అంశంపై విచారణ ఉంది. అప్పుడు లాలూకు బెయిల్ లభిస్తుందనే అంచనా ఉంది.

బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఈసారి RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

First published:

Tags: Bihar Assembly Elections 2020, Tejaswi Yadav

ఉత్తమ కథలు