హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అత్తారింటి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన లాలూ కొత్త కోడలు...

అత్తారింటి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన లాలూ కొత్త కోడలు...

తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య (File)

తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య (File)

2018 మేలో తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య వివాహం జరిగింది. అయితే, తమ పెళ్లయిన కొన్ని నెలలకే.. తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిస అనే విషయం తెలిసిందంటూ గతంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య అత్తవారింటి నుంచి వెళ్లిపోయింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొన్నాళ్లు ఇంటికి దూరంగా గడిపారు. తన విడాకులకు ఓకే చెబితేనే ఇంటికి వస్తానని గతంలో తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చారు. చివరకు విడాకుల పిటిషన్ కూడా ఫైల్ అయింది. ఆ పిటిషన్‌కు ఐశ్వర్య కోర్టుకు సమాధానం కూడా ఇచ్చారు. అయితే, ఇంత వివాదం జరుగుతున్నా.. ఐశ్వర్య తన అత్తవారింటిలోనే ఉంది. లాలూ ప్రసాద్ భార్య, తన అత్త రబ్రీదేవితోనే కలసి ఉంటోంది. కానీ, సడన్‌గా ఐశ్వర్య ఏడ్చుకుంటూ అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయినట్టు తెలిసింది. తన తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఐశ్వర్య రబ్రీదేవి నివాసం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే, వివాదం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు సడన్‌గా అత్తవారింటి నుంచి ఎందుకు వెళ్లిపోయారనేది తెలియలేదు.

2018 మేలో తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య వివాహం జరిగింది. అయితే, తమ పెళ్లయిన కొన్ని నెలలకే.. తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిస అనే విషయం తెలిసిందంటూ గతంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తనకు రక్షణ కావాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

First published:

Tags: Bihar, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు