'గంజాయి తాగి..గాగ్రా వేసుకుంటాడు'...లాలూ కుమారుడిపై సంచలన ఆరోపణలు

విడాకుల కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఐశ్వర్య ఈ వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులంతా కలిసి తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది.

news18-telugu
Updated: August 7, 2019, 10:17 PM IST
'గంజాయి తాగి..గాగ్రా వేసుకుంటాడు'...లాలూ కుమారుడిపై సంచలన ఆరోపణలు
శివుడి వేషంలో తేజ్ ప్రతాప్(Photo/ ANI)
news18-telugu
Updated: August 7, 2019, 10:17 PM IST
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆయన భార్య ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేసింది. తేజ్ ప్రతాప్ గంజాయి తాగి..దేవతలా దుస్తులు ధరించేవాడని ఆరోపించింది.  తనను శివుడి అవతరాంగా చెప్పుకునే వాడని.. అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినలేదని ఆమె తెలిపింది. విడాకుల కేసు విచారణలో భాగంగా పట్నా కోర్టుకు హాజరైన ఐశ్వర్య ఈ వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులంతా కలిసి తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది.

తేజ్ ప్రతాప్ రాధాకృష్ణుల మాదిరి దుస్తులు ధరిస్తాడు. మాకు పెళ్లైన కొన్ని రోజులకు అతని ప్రవర్తన గురించి తెలిసింది. దేవుళ్లలా తనను తాను అలంకరించుకుంటాడు. అంతేకాదు ఒకసారి డ్రగ్స్ తీసుకున్న తర్వాత..స్కర్ట్, బ్లౌజ్ ధరించాడు. ముఖానికి మేకప్ చేసుకొని విగ్ కూడా ధరిస్తాడు. గంజాయి శివుడి ప్రసాదమని,  ఎలా మానాలని తేజ్‌ చెప్పాడు.  ఈ విషయాన్ని అత్తా, ఆడపడచులు చెప్పినా..ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ భార్య


లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు అయిన ఐశ్వర్యరాయ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల పాటు కాపురం బాగానే సాగింది. ఉన్నట్టుండి ఓ రోజు సడన్‌గా తనకు విడాకులు కావాలని తేజ్ ప్రతాప్ ప్రకటించారు. దానికి లాలూ కుటుంబం అడ్డుచెప్పడంతో ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయాడు. ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది.
First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...