హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tech Mahindra: టాలెంట్ ఉందా.. అయితే టెక్ మహీంద్రాలో జాబ్ కన్ఫార్మ్.. ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..!

Tech Mahindra: టాలెంట్ ఉందా.. అయితే టెక్ మహీంద్రాలో జాబ్ కన్ఫార్మ్.. ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..!

కోయంబత్తూర్‌లో టెక్ మహీంద్రా కొత్త కంపెనీ

కోయంబత్తూర్‌లో టెక్ మహీంద్రా కొత్త కంపెనీ

జులై 4న కోయంబత్తూర్‌లోని టైడల్ పార్క్‌లో తన కొత్త క్యాంపస్‌ను టెక్ మహీంద్రా ప్రారంభించింది. ఈ క్యాంపస్‌లో కొత్త ఉద్యోగులను నియమించేందుకే నియామక ప్రక్రియను చేపట్టాలని టెక్ మహీంద్రా యోచిస్తోంది.

ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా (Tech Mahindra) త్వరలోనే 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2023లో 1,000 అసోసియేట్స్‌ (Associates)ని నియమించాలని ప్లాన్ రచిస్తోంది. జులై 4న కోయంబత్తూర్‌లోని టైడల్ పార్క్‌లో తన కొత్త క్యాంపస్‌ను టెక్ మహీంద్రా ప్రారంభించింది. ఈ క్యాంపస్‌లో కొత్త ఉద్యోగులను నియమించేందుకే నియామక ప్రక్రియను చేపట్టాలని టెక్ మహీంద్రా యోచిస్తోంది. ఇందులో భాగంగా 1,000 మందిని చేర్చుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. టాలెంట్‌ను సరఫరా చేసే చిన్న నగరాలు, పట్టణాలల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనే కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా ఈ కొత్త క్యాంపస్ ఉంది.

ఈ క్యాంపస్‌ను అమెరికాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ సమక్షంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. 10,000 చదరపు అడుగుల ఉన్న ఈ క్యాంపస్‌ స్థానిక ప్రతిభను నియమించుకోవడంలో సహాయపడుతుంది. అలానే ఇప్పటికే ఉన్న అసోసియేట్‌లకు వారి స్వస్థలాల నుంచి పని చేయాలనుకునే సౌలభ్యాన్ని అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ(interview)లో టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ మాట్లాడుతూ, రెండేళ్లలోపు కంపెనీ టాలెంట్ సప్లైలో 20 శాతానికి పైగా టాలెంటెడ్ ఉద్యోగులు టైర్-2 లేదా టైర్-3 నగరాల నుంచి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. టాలెంటెడ్ వ్యక్తులు కొన్ని సామాజిక కారణాల వల్ల బెంగుళూరు లేదా పుణె (Pune) వంటి నగరాలకు రావడం లేదన్నారు. మహిళలు కూడా శాంతిని వదిలి సిటీలకు వచ్చేందుకు విముఖత చూపుతున్నారని తెలిపారు. అయితే చిన్న నగరాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం ద్వారా లోకల్ టాలెంటెడ్ వ్యక్తులను కూడా తమ సంస్థలో తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు.

ఇదీ చదవండి:  Crime news : ఇంటికొచ్చిన యువకుడ్ని పట్టుకొని చావబాదారు..వివాహేతర సంబంధమే కారణమంటున్న గ్రామస్తులు


ఈ కొత్త క్యాంపస్‌ను ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), ఫుల్-స్టాక్ డెవలప్‌మెంట్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX), ఇతర నెక్స్ట్-జెన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ (ADMS)కి సంబంధించిన టెక్నాలజీ స్టాక్‌ను డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ క్యాంపస్ లాంచ్‌ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ & మార్కెటింగ్ హెడ్ హర్షవేంద్ర సోయిన్ మాట్లాడుతూ, "టెక్ మహీంద్రాలో టైర్-2, టైర్ -3 నగరాలు ఫ్యూచర్ టాలెంట్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. తదుపరి దశ వృద్ధిని కొనసాగించే శక్తి సామర్థ్యాలతో ఉన్నాయని మేం విశ్వసిస్తున్నాం" అని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం తమ దృష్టంతా మరింత వైవిధ్యమైన, సమగ్ర ప్రతిభను సృష్టించడం పైనే ఉంటుందని వెల్లడించారు.

హర్షవేంద్ర మాట్లాడుతూ... కోయంబత్తూరులో కొత్త క్యాంపస్‌ని ప్రారంభిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. అవాంతరాలు లేని కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందించడం ద్వారా అన్వేషించని మార్కెట్‌లలో వ్యాపార వృద్ధిని పెంచడంలో కొత్త క్యాంపస్ సహాయపడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త క్యాంపస్ ద్వారా వృద్ధి అవకాశాలను అందించడం సాధ్యమవుతుందన్నారు. కోయంబత్తూర్‌లో నివసిస్తున్న అనేక మంది వ్యక్తులకు ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

First published:

Tags: Information Technology, JOBS, Software developer, Tech Mahindra

ఉత్తమ కథలు