పీఎంకేర్స్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విరాళం.. ఆ మొత్తం ఎంతంటే..

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పీఎంకేర్స్‌కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రధాని పిలుపు మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు విరాళం ప్రకటించినట్టు యువరాజ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

news18-telugu
Updated: April 5, 2020, 8:30 PM IST
పీఎంకేర్స్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విరాళం.. ఆ మొత్తం ఎంతంటే..
యువరాజ్ సింగ్
  • Share this:
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పీఎంకేర్స్‌కు విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ, సీని, క్రీడా, వ్యాపార ప్రముఖుల్లో చాలామంది తమ విరాళాన్ని అందజేశారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సైతం తనవంతుగా విరాళం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక రోజున యువరాజ్ సింగ్ రూ.50 లక్షలను పీఎంకేర్స్‌కు అందించాలని నిర్ణయించున్నానని తెలిపారు. పీఎంకేర్స్‌కు సాయం చేస్తున్న విషయాన్ని యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో పాటు ప్రధాని మోదీ పిలుపు అందుకుని రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తానని, నాతో మీరు కూడా వెలిగిస్తారా? అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. నా వంతుగా రూ.50లక్షలు పీఎంకేర్స్‌కు సాయం అందిస్తున్నా.. మీరు సైతం వీలైనంత మేరకు సాయం చేయాలంటూ యువరాజ్ ట్వీట్టర్‌లో కోరారు.
First published: April 5, 2020, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading