Teacher Propose Student : పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే(Teacher) ప్రేమికుడి అవతారం ఎత్తి విద్యార్థినికే ప్రపోజ్ చేశాడు. విద్యార్థినికి సినిమాలో హీరో స్టైల్లో లవ్ ప్రపోజ్ చేశాడు. అందరూ చూస్తూండగానే క్లాస్ రూం మధ్యలో మోకాళ్లపై కూర్చొని విద్యార్థినికి ఐ లవ్ యూ(I Love You) చెప్పాడు. చివరికి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇతగాడి నిర్వాకం వల్ల విద్యార్థిని కూడా సస్పెండ్ అయింది. ఈ ఘటన అసోం(Assam)లోని దేమాజీ సిటీలో జరిగింది.
అసోం రాష్ట్రంలోని దేమాజీ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కేంద్రంలో(DDU-GKY) మనోజ్ కుంబంగ్ అనే వ్యక్తి శిక్షకుడిగా(Trainer)పనిచేస్తున్నాడు. అయితే శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతున్న ఓ విద్యార్థినిపై మనోజ్ కన్నుపడింది. ఈ క్రమంలో తాజాగా క్లాస్ రూమ్ లో అందరూ అందరూ చూస్తూండగానే మోకాలిపై కూర్చొని సినిమా స్టైల్ లో విద్యార్థినికి ప్రపోజ్ చేశాడు. అదే సమయంలో కొంతమంది విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్ లలో దీన్ని రికార్డ్ చేశారు. విద్యార్థులు ఈ వీడియో క్లిప్ ను తమ స్నేహితులతో పంచుకోవడం వల్ల ఈ వీడియో క్లిప్ వైరల్(Viral)గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కుంబాంగ్ని ఉద్యోగం నుండి తొలగించారు. అతను ప్రపోజ్ చేసిన విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు.
IRCTC Thailand Tour : రూ.40 వేలకే థాయిలాండ్ ట్రిప్..IRCTC స్పెషల్ ప్యాకేజీ వివరాలివే
శిక్షణా కేంద్రంలోని అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.."ఇది ఊహించని సంఘటన. మాకు కొన్ని విషయాలు తెలుసు. కానీ అతను ఈ మేరకు వెళ్తాడని ఊహించలేదు. అతను ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు, కానీ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే, మేము అతనిపై, అతనితో సంబంధం ఉన్న అమ్మాయి, ఆ వీడియో రికార్డ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకున్నాము"అని తెలిపారు. కాగా,గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి DDU-GKY(దీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన)వస్తుంది. ఈ కేంద్రంలో పీపీపీ పద్ధతిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తారు. దీర్ఘకాలిక కోర్సులు పూర్తైన తర్వాత ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగాలను కల్పిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.