హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Online Gaming Apps: ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై టీడీఎస్..ఏప్రిల్ 1 నుంచి అమలు..!

Online Gaming Apps: ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై టీడీఎస్..ఏప్రిల్ 1 నుంచి అమలు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జులై 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై మూలం వద్ద పన్ను (TDS) వర్తింపజేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఆ తేదీని మార్చేసి 2023, ఏప్రిల్ 1 నుంచే ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై TDS వసూలు చేయడానికి సిద్ధమైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

TDS On Online Gaming Apps : భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ బిజినెస్ నుంచి చాలామంది వ్యక్తులు అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. గేమింగ్ కంపెనీలు గేమర్ల నుంచి కమీషన్ లేదా ఫీజు తీసుకుంటూ ప్రాఫిట్స్ పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2023, జులై 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై మూలం వద్ద పన్ను (TDS) వర్తింపజేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఆ తేదీని మార్చేసి 2023, ఏప్రిల్ 1 నుంచే ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై TDS(Tax deduction at source) వసూలు చేయడానికి సిద్ధమైంది.

గేమింగ్ రంగానికి సంబంధించిన TDS, GSTలో మార్పులను పునఃపరిశీలించాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT), పీఎం కార్యాలయాన్ని (PMO) ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ వాటాదారులు అభ్యర్థనలు చేస్తుండగానే.. తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం. టీడీఎస్ కలెక్ట్ చేయాలనుకునే నిర్ణయం ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికే కాకుండా.. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, ప్లేయర్లు ట్యాక్స్ రూల్స్‌కి కట్టుబడి ఉండేలా చేస్తుంది.

మరోవైపు ఫిబ్రవరి 23న ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన మూడు పరిశ్రమ సంస్థలైన ఈ-గేమింగ్ ఫెడరేషన్ (EGF), ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) కలిసి TDSలో మార్పులు పునఃపరిశీలించవలసిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)కి లేఖ రాశాయి. అయితే కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుంది. దీంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై ఈ మార్పు ప్రభావం గురించి పరిశ్రమ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.

Demat Account: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా..?మార్చి 31లోపు ఇలా చేయకుంటే అది పనికిరాదు..!

 ట్యాక్స్ ఎక్కువ

అంతకుముందు, ఫిబ్రవరి 9న పరిశ్రమ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) లేఖ రాశాయి. ఆ లేఖలో ఆన్‌లైన్ గేమింగ్‌ను జూదం, గుర్రపు పందెం, కాసినోల వలె పరిగణించరాదని అభ్యర్థించాయి. ఎందుకంటే ఈ జూదం తరహా రంగాలు 28 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని Sin Tax గా పిలుస్తుంటారు. ఈ రేంజ్‌లో జీఎస్టీ చెల్లించడం పెనుబారం అవుతుంది కాబట్టే సంస్థలు లేఖలో ఆ విధంగా అభ్యర్థించాయి. ఇక అధిక పన్ను రేట్లు ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ప్రస్తుతం, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ప్రతి లావాదేవీలో రూ.10,000కి మించిన గేమింగ్ విజయాల విత్‌డ్రాలపై తప్పనిసరిగా 30% TDS కలెక్ట్ చేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ థ్రెషోల్డ్ అలాగే ఉంటుంది కానీ ప్రతి లావాదేవీకి బదులుగా అది వినియోగదారు వార్షిక ఆదాయాలకు వర్తిస్తుంది. దీనర్థం, గేమర్ల వార్షిక ఆదాయం రూ.10,000పై మాత్రమే TDS విధిస్తారు. అప్పుడు ఒక్కసారి మాత్రమే టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ స్థూల ఆదాయం (Gross Revenue)పై 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

First published:

Tags: GST, Online games, Tds

ఉత్తమ కథలు