మమతా బెనర్జీ, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు... బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... ఏపీ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ప్రచారం చేశారు. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచెయ్యాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. అప్పట్లో దీదీ చేసిన ప్రసంగంపై చంద్రబాబు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎంతో చైతన్యవంతంగా, కార్యకర్తల్లో కొత్త జోష్ నింపేలా దీదీ మాట్లాడారని మెచ్చుకున్నారు. టీడీపీ కోసం ఇంత చేసిన ఆమెకు తిరిగి మేలు చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు... ఇవాళ, రేపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నేటి మధ్యాహ్నం బెంగాల్లోని జార్గాం, హల్దియా పట్టణాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రేపు (గురువారం) ఆయన కోల్కతా, ఖరగ్పూర్ నగరాల్లో ప్రచార సభలకు హాజరవుతారు. చంద్రబాబుతో పాటు ఈ సభలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారు.
ఇప్పటికే చంద్రబాబునాయుడు కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలో తెలుగువాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన అక్కడ తెలుగులోనే మాట్లాడారు. ఇక తమిళనాడులో DMK తరపున ప్రచారం చేసిన చంద్రబాబు... మిత్రపక్షాలను కలుపుకుని వెళ్తున్నారు. మమతా బెనర్జీ తర్వాత... మరింత మంది నేతల తరపున ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తారని తెలిసింది.
ఇవి కూడా చదవండి :
సహజీవనం పెళ్లితో సమానం... రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు...
చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?
నేడు MRPS మహా గర్జన... దద్దరిల్లనున్న ధర్నాచౌక్
Published by:
Krishna Kumar N
First published:
May 8, 2019, 7:03 AM IST