ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో అధిక అట్రిషన్ (ఉద్యోగ వలసలు) రేటు సంస్థలకు తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), విప్రో(Wipro), హెచ్‌సీఎల్ టెక్ వంటి దేశీయ ఐటీ దిగ్గజాలు ఉపశమన చర్యలు చేపట్టాయి. ప్రతిభ ఉన్న అభ్యర్థులను అంటిపెట్టుకోవడానికి జీతాలు పెంచడం, ప్రమోషన్స్, రిమోట్‌గా పనిచేయడం వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జులై నుంచి ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు ప్రమోషన్లు అందిస్తామని విప్రో ప్రకటించిన సంగతి తెలిసిందే.
* ఐటీ సంస్థల అట్రిషన్ రేట్లు
జూన్ 2022 త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు సంవత్సర ప్రాతిపదికన 19.7 శాతంగా ఉంది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధిక అట్రిషన్ రేటు. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో ఈ రేటు 17.4 శాతంగా ఉంది. జూన్ 2022 త్రైమాసికంలో విప్రో అట్రిషన్ రేటు 23.3 శాతంగా నమోదైంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే ఇది తక్కువగా ఉంది. కాగా, మార్చి 2022 త్రైమాసికంలో విప్రో 23.8 శాతం అట్రిషన్ రేటును నమోదు చేసింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే హెచ్‌సీఎల్ టెక్ 23.8 శాతం అధిక అట్రిషన్ రేటును నమోదు చేసింది. ఇయర్ టూ ఇయర్ బేసిస్‌లో హెచ్‌సీఎల్ టెక్ అట్రిషన్ లెవల్ జూన్ -2022 త్రైమాసికంలో 11.8 శాతం ఉండగా, జూన్-2023 త్రైమాసికానికి వచ్చేసరికి 12 శాతం పెరిగి 23.8 శాతానికి చేరుకుంది.
* జీతాల పెంపు - ప్రమోషన్లు
నెపుణ్యం ఉన్న ఉద్యోగాలను నిలుపుకోవడం కోసం కంపెనీలు జీతాల పెంపు, ప్రమోషన్లు, ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్లేస్ వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్టే మాట్లాడుతూ.. “మేం త్రైమాసిక ప్రమోషన్ సైకిల్‌కు మారుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాం. త్రైమాసిక ప్రమోషన్స్ జులై నుంచి అమలులోకి వచ్చాయి. సెప్టెంబర్‌లో అర్హులైన వారికి జీతాలు కూడా పెరుగుతాయి’’ అని తెలిపారు. మార్జిన్లపై ప్రభావం చూపుతున్నప్పటికీ ఐటీ కంపెనీలు రిటెన్షన్ బోనస్, అవుట్-ఆఫ్-సైకిల్ వేజ్ రివిజన్స్, జీతాల పెంపు వంటి ఆఫర్స్ చేయడం గమనార్హం.
* వర్క్ ఫ్రం హోమ్ స్టేటస్
ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు ఎక్కువగా రిమోట్‌గా పనిచేస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఆఫీసులకు పిలుస్తున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే, చాలా కంపెనీలు హైబ్రిడ్ మోడల్ వర్కింగ్‌ను అనుసరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీసీఎస్ హాట్ డెస్క్‌లు, అకేషనల్ఆపరేటింగ్ జోన్‌లను (OOZs) కూడా ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ కూడా దీర్ఘకాలికంగా పనిచేసే హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
* త్రైమాసిక ఫలితాలు
జూన్ 2022 త్రైమాసికంలో టీసీఎస్ ఏకీకృత నికర లాభం సంవత్సర ప్రాతిపదికన 5.2 శాతం పెరిగి రూ.9,478 కోట్లుగా ఉంది. ఏప్రిల్-జూన్ 2022లో కంపెనీ ఆదాయం 16.2 శాతం పెరిగి రూ. 52,758 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది కాలంలో కంపెనీ ఆదాయం రూ. 45,411 కోట్లుగా నమోదైంది.
జూన్ 2022 త్రైమాసికంలో రూ.2,563 కోట్ల ఆదాయం వచ్చినట్లు విప్రో ప్రకటించింది. ఇది ఇయర్ టూ ఇయర్ బేసిస్‌గా చూస్తే 20.9 శాతం తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,218 కోట్లతో పోలిస్తే జూన్ 2022 త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం పెరిగి రూ.3,283 కోట్లకు చేరుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: It companies, IT Employees, IT jobs, Work From Home