తౌక్టే తుఫాన్‌తో విరుచుకుపడడంతో పశ్చిమ తీరం అల్లకల్లోంగా మారింది. అరేబియా తీర ప్రాంతాల్లో ఈ రాకాసి తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కేరళ, కర్నాటక, గోవాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్‌ను తౌక్టే వణికిస్తోంది. ఈ అతి భీకర తుఫాన్ ఇవాళ రాత్రి గుజరాత్‌లోని పోర్బందర్, మహవా మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా చోట్లు ఇళ్లు, చెట్లు నేలకొరుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో మరింత నష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. గంటకు 180 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ తుఫాన్ గమనాన్ని లైవ్‌లో ఇక్కడ వీక్షించండి.
తుఫాన్ నేడు రాత్రి తీరం దాటనున్న నేపథ్యంటో మహారాష్ట్రతో పాటు గుజరాత్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మధ్యప్రదేశ్‌కు కూడా యెల్లో అలర్ట్ జారీచేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబై ఎయిర్ పోర్టును రాత్రి 8 గంటల వరకు మూసివేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arabian Sea, IMD, Taukte Cyclone, WEATHER, Weather report