భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (TATA motors) నుంచి ఇటీవల టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ (TATA Punch Micro SUV) విడుదలైన సంగతి తెలిసిందే. పంచ్ మైక్రో-ఎస్యూవీ అక్టోబర్ 2021న భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి మంచి అమ్మకాలను ప్రదర్శిస్తోంది. ఈ మైక్రో-ఎస్యూవీ మార్కెట్‌లో రూ. 5.49 లక్షల నుండి రూ. 9.09 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) మధ్య అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో విడుదలైన టాటా పంచ్‌కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. దీంతో, టాటా పంచ్‌ను సీఎస్డీ (క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్స్)లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ ఆర్మీ (Indian Army)లో పనిచేసే సైనికులు, వారి కుటుంబ సభ్యులకు డిస్కౌంట్‌పై దీన్ని అందజేస్తుంది. బయట మార్కెట్‌లో కంటే సీఎస్డీ క్యాంటీన్లో తక్కువ ధరకే దీన్ని విక్రయిస్తోంది. సీఎస్డీ క్యాంటీన్లో టాటా మోటార్స్ తమ టాటా పంచ్ ఎస్‌యూవీని రూ. 4.86 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరకే విక్రయిస్తోంది.
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం..
కాగా, ఇదే కారు సాధారణ కస్టమర్లకు రూ. 5.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) వద్ద విక్రయిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో లభించే వస్తువల ధరతో పోలిస్తే.. సీఎస్డీ క్యాంటీన్లలో విక్రయించే వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దేశ రక్షణ కోసం సైనికులు చేసే సేవకు గుర్తింపుగా తయారీదారులు అతి తక్కువ మార్జిన్‌తో ఇంచు మించు తయారీ ఖర్చు వద్దే ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి లాభాపేక్ష లేకుండా టాటా మోటార్స్ కూడా తన కార్లను సీఎస్డీ క్యాంటీన్లలో అందుబాటులో తెచ్చింది. సీఎస్డీలో టాటా పంచ్ కారు ధర సాధారణ టాటా డీలర్‌షిప్‌తో పోలిస్తే సుమారు రూ. 1.05 లక్షల తక్కువ ధరకే లభిస్తుంది.
Reliance Jewels: డైమండ్ నెక్లెస్ సెట్స్ లాంఛ్ చేసిన రిలయన్స్ జ్యువెల్స్
టాటా పంచ్ రెగ్యులర్, సీఎస్డీ ధరల మధ్య వ్యత్యాసం..
టాటా పంచ్ రెగ్యులర్ వేరియంట్ అసలు ధర రూ. 5,49,000 వద్ద ఉండగా.. సీఎస్డీలో కేవలం రూ. 4,86,631 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, అడ్వెంచర్ వేరియంట్ అసలు ధర రూ. 6,39,000 ఉండగా రూ. 5,66,406 వద్ద, అకాంప్లీష్ వేరియంట్ అసలు ధర రూ. 7,29,000 ఉండగా కేవలం రూ. 6,46,182 వద్ద లభిస్తాయి. మరోవైపు, క్రియేటివ్ వేరియంట్ అసలు ధర రూ. 8,49,000 ఉండగా కేవలం రూ. 7,52,550 వద్ద, అడ్వెంచర్ ఏఎంటీ వేరియంట్ రూ. 6,99,000 ఉండగా కేవలం రూ. 6,19,590 వద్ద, ఏఎంటీ వేరియంట్ అసలు ధర రూ. 7,89,000 ఉండగా కేవలం రూ. 6,99,366 ధర వద్ద, క్రియేటివ్ ఏఎంటీ వేరియంట్ అసలు ధర రూ. 9,09,000 ఉండగా కేవలం రూ. 8,05,733 ధర వద్ద లభిస్తాయి.
రూ. 2కే ఒక కిలో మీటర్ మైలేజ్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లు ఇవే.. ఓ లుక్కేయండి
టాటా పంచ్ ఎస్యూవీ ఫీచర్లు
టాటా పంచ్ భారతదేశంలో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. 1.2 -లీటర్, ఇన్‌లైన్ -3 పెట్రోల్ మోటారు 86 పీఎస్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లో AMT లేదా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను చేర్చింది. టాటా పంచ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. దీనిలో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టైల్‌లైట్లు, 16 -అంగుళాల డబుల్-టోన్ అల్లాయ్ వీల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను చేర్చింది. వీటితో పాటు 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పుడిల్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లను కూడా చేర్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, Tata, Tata Group, Tata Motors