Home /News /national /

TARGET 400 SEATS FOR LS POLLS WHAT PRASHANT KISHOR PRESENTAION TO CONGRESS IN MEETING WITH SONIA GANDHI MKS

Target 400 Seats: సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ -బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరిక!

సోనియా గాంధీ, ప్రశాంత్ కిశోర్

సోనియా గాంధీ, ప్రశాంత్ కిశోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బేషరతుగానే కాంగ్రెస్ లో చేరికకు సిద్దమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు 2024 లోక్ సభ పోరుపైనా పీకే కాంగ్రెస్ పెద్దలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు..

కాంగ్రెస్ పార్టీకి పునరుద్దానం కల్పించడంలో తన వంతు పాత్ర పోషించడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సిద్దమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కీలక పదవి, కొన్ని అధికారాలు ఇవ్వాలనే డిమాండ్ చేయకుండా బేషరతుగానే పార్టీలో చేరుతానని పీకే స్పష్టం చేసినట్లు వెల్లడైంది. కాంగ్రెస్ లో చేరికపై కొద్ది నెలలుగా మంతనాలు జరుపుతోన్న వ్యూహకర్త.. తొలిసారిగా అధినేత్రి సోనియా గాంధీని కలుసుకున్నారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో శనివారం జరిగిన ముఖ్య నేతల భేటీలో ప్రశాంత్ కిశోర్ ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలోపేతానికి ఏం చేయాలనే అంశాలపై సోనియా ఇవాళ నిర్వహించిన సమావేశానికి కీలక నేతలతోపాటు ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలకూ పీకే బ్లూప్రింట్ సిద్ధం చేసి, సోనియా బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పీకే వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. మొత్తం 545 స్థానాలున్న లోక్ సభలో కాంగ్రెస్ కు ప్రస్తుతం 53 సీట్లు మాత్రమే ఉన్నాయి.

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!


2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా చేసుకోవాలని సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, కాంగ్రెస్ బీజేపీ నేరుగా తలపడుతోన్న రాష్ట్రాల్లో ఒకరకమైన వ్యూహాన్ని, పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాత్మక పొత్తుల ద్వారా మరో రకమైన వ్యూహంతో ముందుకు వెళితే సత్ఫలితాలు సాధించగలమని పీకే సూచించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ లోని అంశాలపై అంతర్గతంగా పనిచేసేందుకు కొందరు నేతలతో టీమ్ ను ఏర్పాటు చేయాలని సోనియా సూత్రప్రాయంగా నిర్ణయించారని తెలుస్తోంది.

Prashant Kishor: కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్! -సోనియా గాంధీతో భేటీ -ఏం మాట్లాడుకున్నారంటే..


కాంగ్రెస్ పార్టీలో చేరిక దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రశాంత్ కిషోర్ తాను వ్యక్తిగతంగా విధించుకున్న డెడ్ లైన్ మే6లోపే స్పష్టత వచ్చేలా ముందడుగు వేశారు. పీకే ప్రధాన కార్యదర్వి పదవిని ఆశిస్తున్నందునే చేరిక ఆలస్యం అవుతోందనే ప్రచారానికి విరుద్ధంగా ‘ఆయన ప్రతిఫలం ఆశించకుండానే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు’అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

CM KCR: కేసీఆర్ దూకుడు.. మళ్లీ ఢిల్లీకి.. ఈసారి లఖీంపూర్ ఖేరీ సందర్శన.. బీజేపీపై పోరు ఉధృతం!సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా తదితర నేతలు హాజరుకాగా, త్వరలో నిర్వహించబోయే చింతన్ బైఠక్ అజెండా, తేదీల అంశాలపైనా నేతలు చర్చించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతోపాటు రెండేళ్ల తర్వాతి సార్వత్రిక ఎన్నికలకూ పార్టీ అనుసరించిన వ్యూహాలను చర్చించేందుకు ఉద్దేశించిన చితన్ శిబిర్ (మేథోమథన సభ) ఈ నెలాఖరులోగానే ఉంటుందని, రాజస్థాన్ వేదికగా అది జరుగుతుందని స్పష్టమైంది. తేదీలతోసహా నేతలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

CM KCR అరెస్టుకు రంగం సిద్ధం -గవర్నర్‌తో భేటీ తర్వాత కేఏ పాల్ బాంబు -ప్రశాంత్ కిషోర్ మాటిదే..


ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవడం ఇదే మొదటిసారి కావడం, కీలకమైన చింతన్ బైఠక్ అజెండా రూపకల్పనలో ఆయన సలహాలు తీసుకున్న క్రమంలో శనివారం నాటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ ముఖ్యులు అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు ప్రధాన వ్యూహకర్తగా మాత్రమే వ్యవహరిస్తారా లేక ప్రాథమిక సభ్యుడిగా సేవలందిస్తారా అనే చర్చ జరుగుతోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Prashant kishor, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు