తాప్సీతో అంత ఈజీ కాదు...ఇరికిద్దామని ట్రై చేసి...ఇరుక్కుపోయాడు...

తాప్సీ నేను దక్షిణాది నటిని కూడా. తమిళం, తెలుగులో మాట్లాడితే మీకు సమ్మతమేనా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ప్రేక్షకుడు మౌనంగా వెనుతిరిగిపోయాడు.

news18-telugu
Updated: November 24, 2019, 4:29 PM IST
తాప్సీతో అంత ఈజీ కాదు...ఇరికిద్దామని ట్రై చేసి...ఇరుక్కుపోయాడు...
తాప్సీ పన్ను (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో తాప్సీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె ప్రేక్షకులతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడారు. అప్పుడు ఆమె పూర్తిగా ఇంగ్లీష్ భాషలో సమాధానం ఇచ్చారు. అది నచ్చని ప్రేక్షకుడు ఇకరు ఇంగ్లీష్ భాషలో కాకుండా హిందీలో మాట్లాడాలని కోరారు. కానీ తాప్సీ మాత్రం ఇక్కడున్న అందరికీ హిందీ రాకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అయినా ఊరుకోని సదరు ప్రేక్షకుడు మీరు హిందీ నటి కాబట్టి హిందీలోనే మాట్లాడాలని పట్టుబట్టాడు. దీంతో తాప్సీ నేను దక్షిణాది నటిని కూడా. తమిళం, తెలుగులో మాట్లాడితే మీకు సమ్మతమేనా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో  ప్రేక్షకుడు మౌనంగా వెనుతిరిగిపోయాడు.  ఆమె ప్రశ్నను ఇతర ప్రేక్షకులు సైతం పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు.



Published by: Krishna Adithya
First published: November 24, 2019, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading