Garbage Bank : ప్లాస్టిక్(Plastic) వాడకం పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, అది క్యాన్సర్ కారణమని తెలిసినా, ప్లాస్టిక్ కవర్ నిషేధం ఎక్కడా కనబట్లేదు. ప్రతి ఒక్కరూ కిరాణ, కూరగాయల, వివిధ రకాల కు ప్లాస్టిక్ కవర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, పచ్చని ప్రకృతి అంతరించి పోవటంతో పాటు, వాయు కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అయితే తమిళనాడు(Tamilnadu)లోని విరుదునగర్ లో కొందరు యువకులు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటి నివారణకు చెత్త బ్యాంకు(Garbage Bank)ను ఏర్పాటు చేశారు. నో మోర్ డంప్ యార్డ్స్(No More Dump Yards)అనే నినాదంతో...ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కలిగే అనార్థాలను, అప్‌సైక్లింగ్ మరియు రీసైక్లింగ్(Recycling)ప్రజలకు వివరిస్తూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల క్రితం గార్బేజ్ బ్యాంక్ ను ప్రారంభించామని..500కి పైగా కుటుంబాలు తమకు చెత్తను అందజేస్తున్నాయని యువకులు తెలిపారు. కిలో చెత్తకు ఆరు రూపాయాలు ఇస్తున్నామని, దీని వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 300 రూపాయాల ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 43,367 కిలోల వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు...విద్యార్థులు, ఉపాధ్యాయులు, గృహిణులు మరియు సాధారణ ప్రజలకు వ్యర్థాల నిర్వహణపై 130కి పైగా అవగాహన మరియు విద్యా సెషన్‌లను నిర్వహించినట్లు కూడా చెప్పారు.
ఏడు జన్మలా,ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు. వ్రతం చేసిన భార్యబాధితులు
ప్రియ అనే స్థానికురాలు మాట్లాడుతూ..."నేను చెత్త బ్యాంకుకు చెత్త ఇచ్చాను, వారు దానిని కొనుగోలు చేశారు. కిలో చెత్తకు బదులుగా ఆరు రూపాయి చెల్లించారు. ఈ చెత్తతో నేను నెలకు 300 రూపాయలు సంపాదించగలను. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. దీని వల్ల పర్యావరణానికి హాని కలగకుండా వ్యర్థాలను రీసైకిల్ చేయవచ్చు" అని చెప్పింది.
స్థానిక వన్నియాపెరుమాళ్ కళాశాల ప్రొఫెసర్ రేవతి రాజశేఖరన్ మాట్లాడుతూ..."నా డిపార్ట్‌మెంట్.. బయోవేస్ట్, ప్లాస్టిక్ మరియు పేపర్ కోసం ప్రతి తరగతిలో మూడు వేర్వేరు డబ్బాలను ఏర్పాటు చేసింది. చివరికి, కళాశాల మొత్తం ఈ పద్ధతిని అనుసరించడంతో, అక్కడ పెద్ద మొత్తంలో చెత్త ఉంది, దానిని వారు పారవేయలేకపోయారు. అయితే మేము దీనిని పరిష్కరించడానికి గార్బేజ్ బ్యాంక్‌కి చేరుకున్నాము. ఆ విధంగా, ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ చేయబడ్డాయి"అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.