సీరియల్స్ గోల ప్రతి ఇంట్లో ఉండేదే. ముఖ్యంగా కొందరు మహిళలు సీరియల్స్ కోసం టీవీలకు అతుక్కుపోతారు. తమ నచ్చిన సీరియల్ టీవీలో వస్తుంటే చాలు.. ఈ లోకాన్నే మరచిపోతారు. పిల్లలను కాసేపు పక్కబెట్టేసి.. పనులన్నింటికీ బ్రేక్ ఇచ్చి.. టీవీ ముందు కూర్చుంటారు. ఆ టైమ్‌లో ఏం జరిగినా సరే... టీవీ ముందు నుంచి కదలరు. సీరియల్స్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఐతే తమిళనాడులో తాజాగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు టీవీ సీరియల్ చూస్తుండగా.. దొంగలు ఇంట్లోకి వచ్చి రచ్చ చేశారు. ఏకంగా 19 లక్షలు కాజేశారు. కాంచీపురం జిల్లాలో గత గురువారం ఈ ఘటన జరిగింది.
covid-19: భారత్ సంచలనం.. ఒకేరోజు 2 వ్యాక్సిన్లు, 1 ట్యాబ్లెట్‌కు ఆమోదం.. అవేంటి?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు మహిళ గురువారం రాత్రి టీవీ చూస్తున్నారు. తమకు ఎంతో ఇష్టమైన సీరియల్ వస్తుండడంతో టీవీకి అతుక్కుపోయారు. అప్పుడు టైమ్ 11 దాటింది. ఇంట్లో వారిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. తమ ఫేవరేట్ సీరియల్ కావడంతో సౌండ్ గట్టిగా పెట్టుకొని టీవీ చూస్తున్నారు. దాదాపు అర్ధరాత్రి కావొస్తున్నా.. మెయిన్ డోర్ పెట్టుకోలేదు. అలానే టీవీ సీరియల్‌లో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. మహిళలు మేల్కొనే ఉండడం.. అందులోనూ టీవీ చూస్తుండడంతో.. కాస్త భయపడ్డారు. కానీ వారు టీవీ సీరియల్‌లో లీనమయ్యారని..ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని గ్రహించి.. ధైర్యంగా ఇంట్లోకి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి వచ్చారని కూడా తెలియనంతంగా ఆ ఇద్దరు మహిళలు టీవీకి అతుక్కుపోయారు. అప్పటికే ఇంట్లోకి వచ్చిన దొంగలు ముఖాలకు మాస్క్ ధరించి... మహిళను, ఆమె బంధువును కత్తితో బెదిరించారు. అలా వాళ్లు చూస్తుండగానే బీరువాలో ఉన్న నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.19 లక్షల విలువైన సొత్తను చోరీ చేశారని వారు (Kanchipuram Robbery case)పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bachpan ka pyara: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ‘‘బచ్పన్ కా ప్యారా’’ ఫేమ్ బాలుడు..
సినీ ఫక్కీలో అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. దొంగలు అలా వచ్చారు.. డబ్బులతో ఇలా ఉడాయించారు. కళ్లు ముందే తమ సొమ్మును తీసుకెళ్తున్నా ఏమీ చేయలేకపోయామని బాధితులు వాపోయారు. టీవీ సౌండ్ ఎక్కువగా ఉండడంతో.. తాము ఎంత అరిచినా ఇరుగుపొరుగు వారికి వినపడలేదని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో మహిళల తప్పు కూడా ఉందని పోలీసులు చెప్పారు. మన జాగ్రత్తలో మనం ఉండాలని.. అర్ధరాత్రి సమయంలో ఇళ్ల తలుపులు మూసుకొని ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్ పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీరియల్స్ చూడాలి గానీ.. మరీ ఇంతలా అందులో మునిగిపోకూడదని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.