ఆ ఒక్క రోజు సెల్‌ఫోన్స్ వాడకండి.. తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి..

బాలల దినోత్సవం రోజు విద్యాశాఖ అధికారులు సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే చిన్నారుల తల్లిదండ్రులంతా ఆరోజు సెల్‌ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో గడపాలని సూచించింది.

news18-telugu
Updated: November 7, 2019, 1:07 PM IST
ఆ ఒక్క రోజు సెల్‌ఫోన్స్ వాడకండి.. తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాబోయే బాలల దినోత్సవం నవంబర్ 14న 'గాడ్జెట్-ఫ్రీ' క్యాంపెయిన్ నిర్వహించాలని తమిళనాడు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బాలల దినోత్సవం రోజు విద్యాశాఖ అధికారులు సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే చిన్నారుల తల్లిదండ్రులంతా ఆరోజు సెల్‌ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో గడపాలని సూచించింది. ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు సెల్‌ఫోన్లు లేకుండా పిల్లల కోసం టైమ్ కేటాయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. తద్వారా క్రమేపీ గాడ్జెట్ ఫ్రీ సమయం పెరుగుతుందని.. పిల్లలతో గడిపేందుకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి అన్ని స్కూళ్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తామని అధికారులు
తెలిపారు.

గాడ్జెట్ ఫ్రీ(#GadgetFreeHour) క్యాంపెయిన్‌లో పాల్గొనాలని విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి నవంబర్ 14వ రోజు.. వారు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేలా చేయండి. ఉపాధ్యాయులు కూడా ఆరోజు సెల్‌ఫోన్ ఉపయోగించవద్దు. తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ఆరోజు మొత్తాన్ని పిల్లల కోసం కేటాయించాలి. ప్రతీ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు అన్ని స్కూళ్లకు ఈ సమాచారాన్ని చేరవేయాలి. ప్రతీ ఒక్కరూ ఇందులో తప్పక పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.
తమిళనాడు విద్యాశాఖ


First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>