హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tamilnadu: రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు .. శశికళను ఎదుర్కోవడానికి మళ్లీ కలిసిపోయిన మాజీ సీఎంలు

Tamilnadu: రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు .. శశికళను ఎదుర్కోవడానికి మళ్లీ కలిసిపోయిన మాజీ సీఎంలు

పన్నీర్​ సెల్వం, పళనిస్వామి (ఫైల్​)

పన్నీర్​ సెల్వం, పళనిస్వామి (ఫైల్​)

పన్నీర్​సెల్వంకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవడంతో అన్నాడీఎంకే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు.

ఇంకా చదవండి ...

తమిళనాడు (Tamil Nādu) రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ లోకి ఆ పార్టీ బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ (Shashikala) రీ ఎంట్రీ పై పార్టీ కో ఆర్డినేటర్ మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (paneer Selvam) ఇటీవలె సానుకూల వ్యాఖ్యలు చేశారు. శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ హైకమాండ్ (party high command) చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేత ఓ పన్నీర్‌ సెల్వం  అన్నారు. శశికళ తిరిగి ఏఐఏడీఎంకే లో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్టానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్న ఆయన రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేయవచ్చు, ఏ పార్టీ నుంచి అయినా వెళ్లిపోవచ్చు అంటూ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు (Interesting comments) చేశారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే విషయంపై సానుకూల స్పందన వ్యక్తం చేసిన పన్నీర్ సెల్వం (paneer Selvam) ఈ అంశంపై పార్టీ నేతలు చర్చించాలి అంటూ కొత్త చర్చకు తెరదీశారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో ముసలం నెలకొంది. ఇదే అదునుగా శశికళ అన్నాడీఎంకేని తన చేతుల్లోకి తీసుకోవాలని పావులు కదుపుతూ వచ్చింది. అయితే పన్నీర్​సెల్వంకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవడంతో అన్నాడీఎంకే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు.

పార్టీ సమయ్వయ కర్తగా పన్నీర్‌సెల్వం..

పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే (AIADMK) సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. పార్టీ సమయ్వయ కర్త (Party Coordinator)గా పన్నీర్‌సెల్వం , ఉప సమన్వయకర్త (Joint Coordinator)గా పళనిస్వామి ఏక్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిస్వామి.. పార్టీ సారథ్య పగ్గాలను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు.

ఇద్దరి మధ్య విభేదాలను పక్కనబెట్టి..

అన్నాడీఎంకేను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు శశికళ (Shashikala) శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు తెరచాటు ప్రయత్నాలతో పాటు.. బహిరంగంగానూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని పన్నీర్ సెల్వం (panner selvam), పళని స్వామి (Palani swami) నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం ఉండేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు. పార్టీ ఎన్నికలకు ముందే ఆ మేరకు వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు.

పార్టీ పగ్గాలు పన్నీర్‌సెల్వంకు ఇచ్చేందుకు పళనిస్వామి ఒప్పుకోగా…అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్‌గా పళనిస్వామి ఉండనున్నారు. ఆ మేరకు పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం.. పార్టీ ఉప సమన్వయకర్తగా (Joint Coordinator) పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేలో పరిణామాలపై శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అన్నాడీఎంకే లోకి రాకుండా తనను ఎవరు అడ్డుకోలేరని అన్నారు. పార్టీ రాజ్యాంగాన్ని పన్నీర్‌-పళని ద్వయం మార్చడంపై శశికళ మండిపడుతున్నారు. శశికళకు చెక్​ పెట్టే యోచనలో పన్నీర్​, పళని ద్వయం కలవడం తమిళనాట చర్చనీయాంశమైంది.

First published:

Tags: AIADMK, Palanisami, Tamil nadu

ఉత్తమ కథలు