• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TAMILNADU MAN TRAMPLED BY ELEPHANT WHILE TAKING A SELFIE SB

ఏనుగుతో సెల్ఫీ దిగాలని చూశాడు... అది ఏం చేసిందో తెలుసా

ఏనుగుతో సెల్ఫీ దిగాలని చూశాడు... అది ఏం చేసిందో తెలుసా

ప్రతీకాత్మకచిత్రం

సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు చేసిన పని అతని ప్రాణాల్నే ప్రమాదంలోకి నెట్టేసింది. ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించాడు. గజరాజు కనిపించగానే... తొండం దగ్గరి నిలబడి ఫోటో దిగుతామనుకున్నాడు.

  • Share this:
    అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పినట్లు పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీసుకోకూడదు. అలాగే ఏనుగు కూడా సైలంట్‌గా ఉంది కదా అరి దాంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించకూడదు. ఎంత సైలంట్‌గా ఉన్న ఏనుగు ఎంత వయ్‌లెంటో తాజాగా జరిగిన ఘటనలో తేలిపోయింది. సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు చేసిన పని అతని ప్రాణాల్నే ప్రమాదంలోకి నెట్టేసింది. ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించాడు. గజరాజు కనిపించగానే... తొండం దగ్గరి నిలబడి ఫోటో దిగుతామనుకున్నాడు. తన మొబైల్ ఫోన్ తీసి.... ఏనుగు ముందు నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. అంతే అమాంతం ఏనుగు ఎగిసిపడింది. యువకుడ్ని తొండంతో కొట్టి తోసేసింది. అంతేనా... కాలుతో కూడా తొక్కేసింది. ఏనుగు కాలుతో తొక్కితో ఏమైనా ఉంటుందా ...ఆ యవకుడు తీవ్రగాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

    ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని శ్రీదేవి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. సెల్ఫీ మీద మోజుతో యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఎన్ని ఘటనలో చోటు చేసుకుంటున్నా... యువకులు మాత్రం తన నైజం మార్చుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఏనుగులు చాలా డేంజరస్ అంటూ తేల్చిచెప్పింది. అవి ఇళ్లలో పెంచుకునే జంతువులు కాదని.. క్రూర మృగాలు అని తీర్పు చెప్పింది. కేరళలో జరిగిన ఓ సంఘటనలో కోర్టు అలాంటి తీర్పు చెప్పింది.



    ఇవికూడా చదవండి: 

    Pics : ఏడుస్తూ విసిగిస్తున్నాడని పిల్లాడి పెదవులపై గమ్ రాసిన తల్లి... తర్వాతేమైందంటే..

    కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్ సప్నా చౌదరి
    First published: