తల్లిని,పిన్నిని కూడా వదలని దుర్మార్గుడు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి..

ప్రతీకాత్మక చిత్రం

బాధిత యువతి ఫిర్యాదుతో గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో అతని తల్లి,పిన్ని,బంధువుల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఉండటంతో ఆశ్చర్యపోయారు.

  • Share this:
    మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న మహమ్మద్ గయాస్(27) యువకుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మార్ఫింగ్ చేసిన ఫోటోల్లో అతని తల్లి,పిన్ని,బంధువుల ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.పెరంబదూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న గయాస్.. సుమతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో కలిసి పలు ఫంక్షన్లకు హాజరయ్యాడు. అలా ఫంక్షన్లలో తీసిన ఫోటోల్లో యువతులు,మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల ఓ యువతి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధిత యువతి ఫిర్యాదుతో గయాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో అతని తల్లి,పిన్ని,బంధువుల ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఉండటంతో ఆశ్చర్యపోయారు. అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: