అరెస్ట్ చేస్తారన్న భయంతోనే...వీడియో తొలగింపుపై గాయని సుచిత్రా

Tamilnadu Custodial Death Case | తమిళనాడు సీబీ సీఐడీ బెదిరింపుల కారణంగా ఈ వీడియోను తొలగించినట్లు గాయని సుచిత్రా సోషల్ మీడియాలో వెల్లడించారు. దర్యాప్తును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

news18-telugu
Updated: July 11, 2020, 1:20 PM IST
అరెస్ట్ చేస్తారన్న భయంతోనే...వీడియో తొలగింపుపై గాయని సుచిత్రా
సింగర్ సుచిత్ర(ఫైల్ ఫోటో)
  • Share this:
తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో సంభవించిన తండ్రి, తనయుడు జయరాజ్, బెన్నిక్స్ లాకప్ డెత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారంరేపింది. ప్రముఖ గాయని సుచిత్రా జయరాజ్, బెన్నిక్స్ లాకప్ డెత్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల దాష్టీకరం యావత్ ప్రపంచానికి శరవేగంగా తెలిసింది. అమెరికాలో దుమారంరేపిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో పోలుస్తూ ఈ ఘటనకు వ్యతిరేకంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ గళంవిప్పారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును తమిళనాడు ప్రభుత్వం సీబీఐ విచారణ కోరింది. అటు తమిళనాడు సీబీ సీఐడీ పోలీసులు ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో మొబైల్ షాపును నడపుతున్నారన్న కారణంతో తండ్రి, తనయుడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని తన వీడియోలో సుచిత్ర ఆరోపించారు. ఈ వీడియోకు 2 కోట్ల వ్యూ్స్ వచ్చాయి.

jayaraj and fenix, jayaraj and fenix news, jayaraj and fenix death, jayaraj and bennix, jayaraj and bennicks case, tamilnadu lockup death case, tamilnadu father son death case, జయరాజ్ బెనిక్స్ కేసు, జయరాజ్ ఫెనిక్స్ మృతి, లాకప్ డెత్ కేసు, తమిళనాడు
పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించిన జయరాజ్, ఆయన తనయుడు బెనిక్స్(ఫైల్ ఫోటో)


అయితే సీబీ సీఐడీ నుంచి వచ్చిన బెదిరింపుల కారణంగా సుచిత్ర సదరు వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించింది. ఈ వీడియోలో సుచిత్ర అవాస్తవాలు చెప్పిందని, ఇందులోని అంశాలను నమ్మవద్దని కోరుతూ తమిళనాడు సీబీ సీఐడీ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. సుచిత్ర చెప్పినవి వాస్తవంకాదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని, ఆమె వెల్లడించిన అంశాలు కేసు దర్యాప్తునకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ ఘటనకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపితం చేసేలా ఈ వీడియో ఉందని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు తెలియజేయడంతో సుచిత్ర..ఆ వీడియోను తొలగించినట్లు తమ ప్రకటనలో తెలిపారు.

తమిళనాడు సీబీ సీఐడీ ప్రకటన


వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో సోషల్ మీడియా వేదికగా సుచిత్రా వెల్లడించారు. సీఐడీ అధికారులు తనతో మాట్లాడినట్లు తెలిపిన సుచిత్రా...అవాస్తవాలు వ్యాపింపజేసినందుకు అరెస్టు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. వారు తనను అరెస్టు చేయగల సమర్థులేనన్న ఉద్దేశంతో...తన న్యాయవాది సలహా మేరకు వీడియోను తొలగించినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తుపై ప్రజలు ఓ కన్నేసి ఉంచాలని కోరిన ఆమె...దర్యాప్తును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.తమిళనాడు సీబీ సీఐడీ బెదిరింపుల కారణంగానే ఆ వీడియోను తొలగించినట్లు సుచిత్రా స్పష్టంచేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Published by: Janardhan V
First published: July 11, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading