TAMILNADU CM SAYS STUDENTS OF STD 9TH 10TH AND 11TH WILL BE PROMOTED TO THE NEXT CLASS WITHOUT TAKING EXAMS SK
Tamilnadu: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈసారి కూడా టెన్త్ పరీక్షలు రద్దు.. అందరూ పాస్
(ప్రతీకాత్మక చిత్రం)
త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే పరీక్షలను రద్దు చేయడంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న వారికి పెద్ద ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పరీక్షలను రద్దుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 8, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికిగా ప్రకటించారు. వారందరి నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పళని స్వామి తీపి కబురు చెప్పారు. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు అసెంబ్లీ ప్రకటన చేశారు. సీీఎం నిర్ణయంపై ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, అటు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Students of std 9th, 10th and 11th will be promoted to the next class without taking exams, in the light of #COVID19 pandemic: Chief Minister Edappadi K Palaniswami, in the state legislative assembly https://t.co/lZ97b5QyPD
త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే పరీక్షలను రద్దు చేయడంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.